ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 సెక్షన్ 73 ప్రకారం.. కోర్టు మీ పాత, కొత్త సంతకాలను పోల్చే అధికారం కలిగి ఉంటుంది. అవసరమైతే, హ్యాండరైటింగ్ నిపుణుడి సహాయాన్ని తీసుకుంటారు. సంతకం చెల్లుబాటును నిరూపించేందుకు బయోమెట్రిక్ డేటా, సాక్షుల వాంగ్మూలాలు, అఫిడవిట్లు ఉపయోగించవచ్చు.
ఉదాహరణకు ఒక చెక్కు మీరు కొత్త సంతకంతో జారీ చేస్తే, అది బ్యాంకులో నమోదైన పాత సంతకంతో సరిపోలకపోతే చెక్కు తిరస్కరణకు గురవవచ్చు. అలాగే, నేగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 ప్రకారం మీరు చట్టపరమైన చర్యకు గురయ్యే అవకాశం ఉంది.
అయితే, మీ సంతకం మారడం చట్టవిరుద్ధం కాదు. కానీ, సమయానికి సమాచారాన్ని ఇవ్వకపోతే, పలు చట్టపరమైన సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి సంతకాలు మార్చడం లేదా వేరు వేరు ప్రదేశాల్లో వేరువేరుగా పెట్టడం చేయవద్దు. అలా జరిగితే చట్టబద్దత ఉండేలా వివరాలు అందించాలి.
గమనిక : ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే.. ఇలాంటి సమస్యలు ఉంటే న్యాయ నిపుణుల సలహాలు తీసుకోండి.