AK-203 Rifles: ఇండియ‌న్ ఆర్మీలోకి ‘సింహం’ వస్తోంది.. ఇక శ‌త్రువుల‌కు ద‌బిడి దిబిడే. ఏషియా నెట్ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

Published : Jul 17, 2025, 04:48 PM ISTUpdated : Jul 17, 2025, 04:51 PM IST

మేకిన్ ఇండియా నినాదం కేవ‌లం పారిశ్రామిక రంగానికి మాత్రేమ ప‌నిమితం కాకుండా ర‌క్ష‌ణ రంగానికి కూడా విస్త‌రిస్తోంది. ఇండియ‌న్ ఆర్మీలో అధునాత‌న ఆయుధాల‌ను భార‌త్‌లోనే త‌యారు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఇండియ‌న్ ఆర్మీలోకి కొత్త ఆయుధం రానుంది. 

PREV
15
భారతదేశంలో తయారవుతున్న నూతన ఆయుధం ‘షేర్’

భారత సైన్యం కోసం రష్యాతో కలిసి తయారుచేస్తున్న AK-203 రైఫిల్‌ను ‘షేర్’ అని పేరు పెట్టారు. హిందీలో 'షేర్' అంటే సింహం. ఇది ధైర్యానికి, శక్తికి, రక్షణకు ప్రతీక. 2025 డిసెంబర్ నాటికి ఈ ఆయుధాన్ని సైన్యానికి అందించబడనున్నారు. ఇది ఇండియన్ ఆర్మీ ఇన్ఫెంట్రీ విభాగానికి ప్రధాన ఆయుధంగా ఉపయోగపడనుంది.

25
రూ. 5,200 కోట్ల ఒప్పందంతో లక్షల రైఫిళ్లు

2021లో భారత్-రష్యా దేశాల మధ్య రూ. 5,200 కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. దీని కింద 6,01,427 AK-203 రైఫిళ్లు తయారుచేసి ఇండియన్ ఆర్మీకి సరఫరా చేయాల్సి ఉంది. 48,000 రైఫిళ్లు ఇప్పటికే సరఫరా అయ్యాయి, వాటిలో 50% స్థానికంగా తయారయ్యాయి.

35
ఉత్పత్తి వేగవంతం

IRRPL సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మేజర్ జనరల్ ఎస్.కె. శర్మ ప్రకారం, 2025 డిసెంబర్ 31నాటికి పూర్తిగా భారతదేశంలో తయారైన మొదటి AK-203 రైఫిల్‌ను ‘షేర్’గా విడుదల చేస్తారు. వచ్చే 5 నెలల్లో 70,000 రైఫిళ్లు సరఫరా చేస్తామన్నారు, వాటిలో 70% లోకల్ కంటెంట్ ఉంటుంది. అంతేకాకుండా, 2032 డెడ్‌లైన్‌కి ముందే, 2030 మధ్య నాటికి అన్ని రైఫిళ్లు పంపిణీ చేసే లక్ష్యం పెట్టుకున్నారు.

45
భారత రక్షణ ఉత్పత్తులకు గ్లోబల్ డిమాండ్

IRRPL చెబుతున్న సమాచారం ప్రకారం, ఆసియా, ఆఫ్రికా దేశాలు భారత్‌లో తయారయ్యే AK-203పై ఆసక్తి చూపిస్తున్నాయి. అంతేకాక, 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ శాఖలు, పారామిలిటరీ సంస్థలు కూడా ఈ రైఫిళ్లను కొనుగోలు చేయాల‌ని అనుకుంటున్నారు. 2026 నుంచి ఏటా 1.5 లక్షల రైఫిళ్లు తయారు చేయబోతున్నారు. అందులో 1.2 లక్షలు ఆర్మీకి, 30,000 ఇతర అవసరాలకు కేటాయించనున్నారు.

55
‘షేర్’ ప్రత్యేకతలు ఎన్నెన్నో

AK-203 రైఫిల్ వజన్ 3.8 కిలోలు మాత్రమే. పాత AK-47తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇందులో టెలిస్కోపిక్ స్టాక్, మోడ్రన్ ఆప్టిక్స్‌కు అనుకూలత, కిక్బ్యాక్ తక్కువగా ఉండేలా ప్రత్యేక డిజైన్ చేశారు. 7.62×39mm చాంబర్‌తో పనిచేసే ఈ రైఫిల్‌ను మెరుగైన పర్సిషన్, తక్కువ బరువు, సులభంగా నిర్వహించగలిగే విధంగా రూపొందించారు.

Read more Photos on
click me!

Recommended Stories