పవన్ కల్యాణ్ నే ఫాలో అవుతున్న విజయ్.. కానీ డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం..?

Published : Apr 30, 2026, 02:27 PM IST

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటి తెలుగు హీరో పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు… మరి తమిళనాడులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్ కి ఏకంగా ముఖ్యమంత్రి సీటుపైనే కన్నేశాడు. ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి… ఎలాగో చూద్దాం. 

PREV
14
విజయ్ సీఎం అవుతారా..?

Tamilnadu Exit Polls 2026 : దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాల్లో ద్విముఖ పోరు మాత్రమే ఉండేది. కానీ, ఈసారి సీన్ మారింది... తమిళనాట త్రిముఖ పోరు తప్పలేదు. సాంప్రదాయ స్థానిక పార్టీలు ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) లకు తమిళ హీరో విజయ్ గట్టిపోటీ ఇచ్చారనే చెప్పాలి. వెండితెరపై తన నటవిశ్వరూపం చూపించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్, రాజకీయ రణక్షేత్రంలోనూ అదే స్థాయిలో ప్రభావం చూపుతున్నట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ మాదిరిగా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ చక్రం తిప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే చెబుతున్నాయి.

24
ఎగ్జిట్ పోల్స్ లో డిఎంకే, విజయ్ హవా..

తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే తన పట్టును నిలుపుకునే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. పీపుల్స్ పల్స్ అంచనా ప్రకారం డీఎంకే కూటమి 125 నుంచి 145 స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకోనుంది... మళ్లీ స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని చెబుతోంది. మిగతా సర్వేలు కూడా డిఎంకేకే పట్టం కడుతోంది.

అయితే ఈ ఎన్నికల్లో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం సినీ నటుడు విజయ్ స్థాపించిన ''తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ప్రభావం. ఈ అసెంబ్లీ ఎన్నికల ద్వారానే విజయ్ మొదటిసారి పోటీ చేస్తున్నారు. అయితే తొలి ప్రయత్నంలోనే విజయ్ పార్టీ 18 నుంచి 24 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలు చెబుతుండటం విశేషం. ఏఐఏడీఎంకే 65-80 స్థానాలకు పరిమితమయ్యేలా కనిపిస్తోంది. అయితే కొన్ని సమీకరణలు వర్కౌట్ అయితే విజయ్ కూడా సీఎం అయ్యే అవకాశాలున్నాయి... అదెలాగో తెలుసుకుందాం.

34
కర్ణాటక JDS... తమిళనాటTVK..?

విజయ్ సీఎం కావడం కష్టమే కానీ అసాధ్యం కాదు... ఉదాహరణకు 2018 కర్ణాటక ఎన్నికలను చూడొచ్చు. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటకలో మెజారిటీకి 113 సీట్లు అవసరం. ఆ ఎన్నికల్లో బీజేపీ 104, కాంగ్రెస్ 78, జనతాదళ్ (సెక్యులర్) 37 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు, కాంగ్రెస్ పార్టీ జేడీ(ఎస్)కు మద్దతిచ్చింది. కేవలం 37 సీట్లు గెలిచిన జేడీ(ఎస్) నేత కుమారస్వామికి సీఎం పదవి ఇచ్చి, కాంగ్రెస్ (78+37=115) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇదే ఫార్ములా తమిళనాడులో రిపీట్ అయితే... అన్నాడీఎంకే, టీవీకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, విజయ్ సీఎం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఉదాహరణకు గత ఎన్నికల్లో 75 సీట్లు గెలిచిన అన్నాడీఎంకే, ఈసారి 85 సీట్లు గెలిచి, టీవీకే 35 సీట్లు సాధిస్తే వారి కూటమికి (120) మెజారిటీ వస్తుంది. అప్పుడు విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.

44
TVK గేమ్ ఛేంజర్‌ అవుతుందా..?

ఎగ్జిట్ పోల్స్ గణాంకాలను పరిశీలిస్తే విజయ్ పార్టీ కేవలం ఓట్లను చీల్చడమే కాకుండా, గణనీయమైన ఓట్ షేర్‌ను సాధించే దిశగా దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లలో అత్యధికులు విజయ్ వైపు మొగ్గు చూపినట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇక సాంప్రదాయ పార్టీల మీద అసహనంతో ఉన్న తటస్థ ఓటర్లు కూడా TVK ఒక బలమైన ప్రత్యామ్నాయంగా మారింది. దీంతో టివికే మంచి ఓట్లు, సీట్లు సాధించి తమిళ రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నారు.

సినిమా క్లైమాక్స్‌లాగే తమిళనాడు ఎన్నికల ఫలితాలు కూడా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే, కోలీవుడ్ 'దళపతి' కాస్తా తమిళనాడు 'అధిపతి' అయ్యే దిశగా తొలి అడుగు వేసినట్లే.

Read more Photos on
click me!

Recommended Stories