ఉపేంద్రను విడిపించడానికి, అతని కొడుకు ప్రీతమ్ సింగ్, దుర్గ్ ఇంకా రాయ్ గఢ్ మధ్య తిరిగే జన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ ను ఒక గ్యాంగ్ తో హైజాక్ చేశాడు. రాయ్ పూర్ కు దగ్గరలో ఉన్న కుమ్హారి రైల్వే స్టేషన్ దగ్గర రైలును ఆపిన హైజాక్ బ్యాచ్ ఉపేంద్ర సింగ్ ను కూడా తీసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు.
తండ్రిని తీసుకెళ్లడమే మెయిన్ టార్గెట్ కాబట్టి రైలును హైజాక్ చేసిన ప్రీతమ్ సింగ్, ఆ గ్యాంగ్ డ్రైవర్ ని, మిగతా ప్రయాణికులను ఏమీ చేయలేదు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపింది.