రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తే వచ్చే రీఫండ్ నిబంధనల్లో రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రయాణికులు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.
నూతన ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుండి ఇండియన్ రైల్వే కొత్త టికెట్ రూల్స్ తీసుకువస్తోంది. ఇంతకాలం ట్రైన్ టికెట్ తీసుకుని చివరి క్షణంలో క్యాన్సిల్ చేసినా డబ్బులు రీఫండ్ అయ్యేవి… కానీ ఇకపై ఇలా ఉండదు. రైల్వే టికెట్ రీఫండ్ రూల్స్ మారనున్నాయి… వాటిగురించి ఇక్కడ తెలుసుకుందాం.
24
చివరిక్షణంలో రైల్వే టికెట్ క్యాన్సిల్ చేశారో.. అంతే సంగతి
భారత్‌లో దూర ప్రయాణాలకు రైలు చాలా సౌకర్యవంతమైనది. అందుకే ఎక్కువ మంది రైళ్లలో ప్రయాణిస్తారు.. ఇందుకోసం ముందుగానే టికెట్ రిజర్వ్ చేసుకుంటారు. అయితే రైల్వే శాఖ ఇప్పుడు టికెట్ రద్దు నిబంధనలను మార్చింది. రైలు బయలుదేరడానికి 8 గంటల లోపు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ రాదని ప్రకటించింది.
34
రైలు టికెట్ రీఫండ్ రూల్స్
రైలు బయలుదేరడానికి 8 నుంచి 24 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే 50% మాత్రమే రీఫండ్ వస్తుంది. 24 నుంచి 72 గంటల ముందు రద్దు చేస్తే 75% డబ్బులు తిరిగి ఇస్తారు. 72 గంటల కంటే ముందు రద్దు చేసుకుంటే పూర్తి రీఫండ్ పొందవచ్చు. ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
గతంలో టికెట్ బుక్ చేసిన స్టేషన్‌లోనే క్యాన్సిల్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆఫ్‌లైన్ టికెట్లను ఏ రైల్వే స్టేషన్‌లోనైనా రద్దు చేసుకునే సౌకర్యం కల్పించారు. అలాగే రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే వెసులుబాటు కూడా ఇచ్చారు.