Petrol: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై చర్చ మొదలైంది. దీంతో చాలా మంది ప్లాస్టిక్ బాటిల్స్‌లో పెట్రోల్‌ను నింపుకొని స్టోర్ చేసుకుంటున్నారు. అయితే ఇలా పెట్రోల్ నిల్వ చేయడం చట్ట విరుద్ధమని మీకు తెలుసా.
భారతదేశంలో పెట్రోల్ విక్రయం, నిల్వ, రవాణా వంటి అంశాలు Petroleum Act 1934, Petroleum Rules 2002 ప్రకారం నిర్వహిస్తారు. ఈ చట్టాల ప్రకారం పెట్రోల్ చాలా ప్రమాదకరమైన పదార్థంగా పరిగణిస్తారు. అందువల్ల దాన్ని ఎక్కడ పడితే అక్కడ నిల్వ చేయడం లేదా ఏ డబ్బాలోనైనా నింపడం అనుమతించరు. పెట్రోల్ బంక్‌లకు కూడా ఈ విషయంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. సాధారణ ప్లాస్టిక్ బాటిళ్లు, డబ్బాలు, నీటి ట్యాంకులు వంటి అసురక్షిత పాత్రల్లో పెట్రోల్ ఇవ్వకూడదు. ఇది భద్రత పరంగా ప్రమాదకరంగా భావిస్తారు.
25
ఎలాంటి డబ్బాల్లో పెట్రోల్ నింపడానికి అనుమతి ఉంది?
చట్టాల ప్రకారం పెట్రోల్ సాధారణంగా రెండు విధాలుగా మాత్రమే నింపడానికి అనుమతి ఉంది. నేరుగా వాహనాల ఇంధన ట్యాంకులో లేదా ఇంధన నిల్వ కోసం ప్రత్యేకంగా రూపొందించిన లోహపు డబ్బాల్లో మాత్రమే. ఈ డబ్బాలు ప్రత్యేకంగా భద్రతా ప్రమాణాలతో తయారు చేస్తారు. వాటిలో ఒత్తిడి నియంత్రణ, అగ్ని ప్రమాదం నివారణ వంటి రక్షణ వ్యవస్థలు ఉంటాయి. అందువల్ల ప్రమాదం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
35
ఇంట్లో ఎంత పెట్రోల్ నిల్వ ఉంచుకోవచ్చు?
సాధారణ వ్యక్తులు ఇంట్లో పెట్రోల్ నిల్వ ఉంచుకోవాలంటే కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. సాధారణంగా వ్యక్తిగత వినియోగం కోసం 30 లీటర్ల వరకు పెట్రోల్ భద్రంగా నిల్వ ఉంచుకోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ పరిమితిని 100 లీటర్ల వరకు పెంచుకోవచ్చు. అయితే ఇందుకు భద్రతా నిబంధనలు పాటించాలి. పెట్రోల్‌ను సురక్షితమైన, వేరుగా ఉన్న ప్రదేశంలో మాత్రమే నిల్వ చేయాలి. ఈ పరిమితికి మించి పెట్రోల్ నిల్వ చేయాలంటే ప్రభుత్వ అనుమతి, లైసెన్స్ తప్పనిసరి.
సాధారణ ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్రోల్ నింపడం చాలా ప్రమాదకరం. పెట్రోల్ చాలా త్వరగా మంటలు అంటుకునే పదార్థం. సాధారణ డబ్బాల్లో ఒత్తిడి నియంత్రించే వ్యవస్థ ఉండదు. అలాగే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ నుంచి రక్షించే ఏర్పాట్లు కూడా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న స్పార్క్ కూడా పెద్ద అగ్ని ప్రమాదానికి కారణం కావచ్చు. కొన్ని సందర్భాల్లో పేలుడు కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఇలాంటి నిల్వలను నిషేధించింది.
55
నియమాలు ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి?
ఈ నియమాలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు. అసురక్షిత డబ్బాల్లో పెట్రోల్ ఇస్తున్నట్టు పెట్రోల్ బంక్‌లపై నిర్ధారణ అయితే వారి లైసెన్స్‌ను రద్దు చేయవచ్చు లేదా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. అలాగే అనధికారంగా పెట్రోల్ నిల్వ చేయడం లేదా రవాణా చేస్తే భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడవచ్చు.