Indian Railways Free AC Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !

Published : Sep 17, 2026, 08:04 AM IST

Indian Railways Free AC Travel: భారతీయ సైనికులకు రక్షణ శాఖ బిగ్ గిఫ్ట్ ప్రకటించింది. నవంబర్ 1 నుంచి వీర పురస్కార గ్రహీతలకు రైళ్లలో ఉచిత 1st, 2nd ఏసీ ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

PREV
15
ఇకపై రైళ్లలో ఫ్రీగా ఏసీ ట్రావెల్.. నవంబర్ 1 నుంచి కొత్త రైల్వే రూల్స్

దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించిన వీర జవాన్లకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఒక సూపర్ గిఫ్ట్ ప్రకటించింది. దేశ సరిహద్దుల్లో అతులిత త్యాగాలు చేసిన సైనికులను, వారి కుటుంబాలను గౌరవించేందుకు కేంద్రం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

ఇకపై సేనా పతక్, నౌసేనా పతక్, వాయుసేనా పతక్ పురస్కారాలు అందుకున్న యోధులకు భారతీయ రైల్వేలో జీవితాంతం ఉచితంగా ప్రయాణించే సదుపాయం లభించనుంది. ఈ కొత్త నిబంధనలు, డిజిటల్ సేవలు ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ ప్రక్రియ మొత్తాన్ని చాలా సులభంగా, పూర్తి డిజిటల్ రూపంలో అందుబాటులోకి తెచ్చారు.

25
ఉచిత ఏసీ ప్రయాణం ఎవరెవరికి వర్తిస్తుంది?

ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులు భారతీయ రైల్వేలోని ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ ఏసీ, ఏసీ ఛైర్ కార్‌లలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ లైఫ్‌టైమ్ ఫ్రీ ట్రావెల్ వెసులుబాటు వీరత్వ పురస్కార గ్రహీతలతో పాటు వారి జీవిత భాగస్వాములకు (భార్య లేదా భర్త) కూడా జీవితాంతం వర్తిస్తుంది. ఒకవేళ పురస్కార గ్రహీత మరణించి, వారి భాగస్వామి మిగిలి ఉంటే.. వారు రెండో పెళ్లి చేసుకునే వరకు ఈ సౌకర్యం చెల్లుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, చాలా చిన్న వయస్సులోనే దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన అమరవీరుల త్యాగాన్ని కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించింది. పెళ్లి కాకుండానే మరణానంతరం వీరత్వ పురస్కారం పొందిన సైనికుల తల్లిదండ్రులను కూడా ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చారు.

35
పూర్తిగా డిజిటల్, పేపర్‌లెస్ ప్రాసెస్

ఈ సదుపాయాన్ని వినియోగించుకునే పద్ధతిని రక్షణ మంత్రిత్వ శాఖ అత్యంత సులభంగా, పారదర్శకంగా తీర్చిదిద్దింది. ఈ లబ్ధిని పొందడానికి లబ్ధిదారులు ఎలాంటి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అర్హులైన వారు భారతీయ రైల్వే కన్సెషన్ కార్డ్ పోర్టల్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పోర్టల్‌లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ధృవీకరణ పూర్తయిన వెంటనే, అభ్యర్థులకు ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ ట్రావెల్ పాస్ జారీ అవుతుంది. దీనివల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవ్వడంతో పాటు ఎలాంటి పేపర్ వర్క్ ఉండదు.

45
నవంబర్ 1 నుంచి ఆన్‌లైన్ బుకింగ్స్ స్టార్ట్

డిజిటల్ ట్రావెల్ పాస్ పొందిన తర్వాత అర్హులైన లబ్ధిదారులు తమ రైలు టికెట్లను చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పాస్ ఆధారంగా టికెట్లు బుక్ చేసుకునే ఆన్‌లైన్ సౌకర్యం నవంబర్ 1 నుంచి భారతీయ రైల్వే ఐఆర్‌సీసీపీ (IRCCP) వెబ్ పోర్టల్‌లో అందుబాటులోకి వస్తుంది. ఈ పూర్తి డిజిటల్ పేపర్‌లెస్ సిస్టమ్ వల్ల అనవసర ఆలస్యం తగ్గుతుంది. ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పడమే కాకుండా, సైనికులు వారి ఇంట్లో నుంచే ఎలాంటి పేపర్ వర్క్ అవసరం లేకుండా క్షణాల్లో ఉచిత రైలు టికెట్ పొందే వెసులుబాటు లభిస్తుంది.

55
సైనికులు, వారి కుటుంబాలకు సముచిత గౌరవం

సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఈ నిర్ణయం ఒక నిదర్శనమని రక్షణ రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో, ప్రాణాలకు తెగించి సైనికులు సరిహద్దులను ఎలాగైతే కాపాడారో.. వారి త్యాగాలను స్మరించుకోవడం, గౌరవించడం ప్రతి పౌరుడి, దేశం బాధ్యత. ప్రభుత్వం తీసుకున్న ఈ చరిత్రాత్మక అడుగు ప్రస్తుతం విధుల్లో ఉన్న సైనికులకు, రిటైర్డ్ జవాన్లకు మరింత మనోధైర్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా, రాబోయే తరాలకు, నేటి యువతకు దేశభక్తి భావనను నింపడానికి, సైన్యంలో చేరేందుకు ఇదొక గొప్ప ప్రేరణగా నిలుస్తుందని చెప్పవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories