భారతదేశంలో రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటి. ఈ ప్రయాణంలో ట్రాక్ పక్కన చిన్న చిన్న బోర్డులు గమనించి ఉంటారు. వాటిలో C/F లేదా W/L కూడా ఉంటాయి. ఇంతకీ వీటి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రైల్వే ట్రాక్ పక్కన ఉండే C/F లేదా W/L బోర్డులు ఎల్లప్పుడూ పసుపు రంగులోనే ఉంటాయి. పసుపు ప్రకాశవంతమైన రంగు కావడంతో దూరం నుంచే కనిపిస్తుంది. పగలు, రాత్రి రెండింట్లోనూ స్పష్టంగా కనిపించడానికి పసుపు రంగుని ఎంచుకున్నారు.
25
W/L అంటే ఏమిటి?
W/L అంటే Whistle / Level Crossing. అంటే, రైలు క్రాసింగ్ దగ్గరికి వస్తున్నప్పుడు లోకో పైలట్ (డ్రైవర్) తప్పనిసరిగా హారన్ మోగించాలనే సూచన. ఈ బోర్డు సాధారణంగా క్రాసింగ్‌కి 250 నుంచి 300 మీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తారు.
35
C/F బోర్డు అర్థం
C/F లేదా C/Fa అంటే Whistle Blowing / Gate అనే అర్థం. దీని ఉద్దేశ్యం కూడా అదే – లోకో పైలట్ హారన్ మోగించడం ద్వారా ముందున్న ప్రజలు, వాహనాలు, జంతువులు జాగ్రత్తపడేలా చేయడం. దీనివల్ల ప్రమాదాలను తగ్గించవచ్చు.
రైల్వే క్రాసింగ్ దగ్గర వాహనాలు లేదా వ్యక్తులు ఉండవచ్చు. లోకో పైలట్ ముందుగానే వీరికి సమాచారం ఇవ్వకపోతే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ బోర్డులు ముందుగా హెచ్చరికగా ఏర్పాటు చేస్తారు. హారన్ శబ్దం విన్న వెంటనే ప్రజలు రైలు ట్రాక్ నుంచి దూరంగా కదులుతారు.
55
భారతీయ రైల్వే ప్రత్యేకత
ప్రపంచవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌లో భారతదేశం నాలుగవ స్థానం, ఆసియాలో మొదటి స్థానంలో ఉంది. ఇంత పెద్ద నెట్‌వర్క్‌లో ప్రయాణించే ప్రతి ఒక్కరి భద్రత కోసం ఈ తరహా సంకేత బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు మరెన్నో చర్యలు తీసుకుంటోంది ఇండియన్ రైల్వే.