ఉప‌రాష్ట్ర‌ప‌తి జీతం ఎంతో తెలుసా.? ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ప్రిపేర్ అయ్యేవారికి ఈ విష‌యాలు క‌చ్చితంగా తెలియాలి.

Published : Sep 09, 2025, 10:10 AM IST

జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యంగా మారింది. ఇప్పటికే ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్టీఏ అభ్యర్థి సి.పి.రాధాకృష్ణన్ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. వైస్ ప్రెసిడెంట్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తిక‌ర విష‌యాలు.. 

PREV
15
రెండో అత్యంత ప్ర‌ధాన్య‌మైన ప‌ద‌వి

భారతదేశంలో రాష్ట్రపతి తర్వాత రెండవ అత్యంత ప్రాధాన్యమైన పదవి ఉపరాష్ట్రపతిది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 65 ప్రకారం, రాష్ట్రపతి రాజీనామా చేసిన స‌మ‌యంలో, మరణించిన స‌మ‌యంలో, తొల‌గించిన స‌మ‌యంలో లేదా విధులు నిర్వర్తించలేకపోవడం వంటి సందర్భాల్లో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అంతేకాదు, ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్-అఫీషియో చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

25
ఉపరాష్ట్రపతి పదవికి అవసరమైన అర్హతలు

* భారత పౌరుడై ఉండాలి.

* కనీసం 35 సంవత్సరాలు నిండి ఉండాలి.

* రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యే అర్హత ఉండాలి.

* కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వం లేదా ప్రజా సంస్థల్లో ఎటువంటి లాభదాయక పదవి కలిగి ఉండకూడదు.

35
భారత ఉపరాష్ట్రపతుల చరిత్ర (1952–2023)

భారతదేశంలో ఇప్పటివరకు 13 మంది ఉపరాష్ట్రపతులు పనిచేశారు. మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, 1952 మే 13న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రెండు టర్మ్‌లు పూర్తి చేశారు. ఆ తర్వాత పలు ప్రముఖులు ఈ పదవిని అలంకరించారు. వారి జాబితా..

* సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952–1962)

* జాకీర్ హుస్సేన్ (1962–1967)

* వి.వి. గిరి (1967–1969)

* గోపాల్ స్వరూప్ పాఠక్ (1969–1974)

* బి.డి. జట్టి (1974–1979)

* మొహమ్మద్ హిదయతుల్లా (1979–1984)

* ఆర్. వెంకటరామన్ (1984–1987)

* శంకర్ దయాళ్ శర్మ (1987–1992)

* కె.ఆర్. నారాయణన్ (1992–1997)

* క్రిషన్ కాంత్ (1997–2002)

* భైరాన్ సింగ్ షెకావత్ (2002–2007)

* మొహమ్మద్ హమీద్ అన్సారీ (2007–2017)

* ఎం. వెంకయ్య నాయుడు (2017–2022)

* జగదీప్ ధంఖర్ (2022–2005లో రాజీనామా)

45
రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవి ప్రాధాన్యం

* ఆర్టికల్ 63 ప్రకారం, భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారని స్పష్టం చేశారు.

* ఆర్టికల్ 65 ప్రకారం, రాష్ట్రపతి విధులు నిర్వర్తించలేని పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకుంటారు.

* ఉపరాష్ట్రపతి గరిష్టంగా 6 నెలలు వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగవచ్చు.

* ఉపరాష్ట్రపతిని తొలగించేందుకు రాజ్యసభ పూర్తి మెజారిటీతో తీర్మానం ఆమోదించాలి. ఈ తీర్మానాన్ని లోక్‌సభ కూడా ఆమోదించాలి.

55
మ‌రికొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు.

ప్రశ్న 1: భారత ఉపరాష్ట్రపతి పదవిని ఎక్కడి నుండి స్వీకరించారు?

జవాబు: అమెరికా రాజ్యాంగం నుంచి.

ప్రశ్న 2: పోటీ లేకుండా ఎన్నికైన ఉపరాష్ట్రపతులు ఎవరు?

జవాబు: సర్వేపల్లి రాధాకృష్ణన్, హిదయతుల్లా, శంకర్ దయాళ్ శర్మ.

ప్రశ్న 4: ఉపరాష్ట్రపతి జీతం ఎంత?

జవాబు: నెలకు రూ. 4 లక్షలు (భత్యాలు మినహాయించి).

ప్రశ్న 5: భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు?

జవాబు: సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952–1962).

Read more Photos on
click me!

Recommended Stories