ఆపరేషన్ సింధూర్‌తో భారత ఆర్మీ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. మన అధునాతన ఆయుధాలను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అయితే తాజాగా ఇండియన్ ఆర్మీలో ISTAR అనే మరో అధునాతన అస్త్రం చేరబోతోంది.
ISTAR అంటే Intelligence, Surveillance, Target Acquisition and Reconnaissance. అంటే శత్రు కదలికలను గమనించడం, విశ్లేషించడం, లక్ష్యాలను గుర్తించడం, డేటాను తక్షణమే అందించడం వంటి పనులను ఒకే విమానం చేస్తుంది.
25
భారత వాయుసేనకు 3 ISTAR జెట్‌లు
భారత రక్షణ శాఖ రూ. 10,000 కోట్లు ఖర్చుతో మూడు అధునాతన ISTAR విమానాలను కొనుగోలు చేయనుంది. ఇవి సాధారణ నిఘా విమానాల కంటే ఎంతో శక్తివంతమైనవి. అవి శత్రు ప్రాంతాలను గమనించడమే కాకుండా, దాడులకు ప్రణాళిక రూపొందించడంలోనూ ఉపయోగపడతాయి.
35
వీటి ప్రత్యేకతలు ఏంటంటే.?
ఈ విమానాల్లో రాడార్లు, హై-రిసల్యూషన్ కెమెరాలు, AI ఆధారిత సెన్సార్‌లు ఉంటాయి. ఇవి చీకటిలో, మేఘాల మధ్యలోనూ శత్రు కదలికలను పసిగట్టగలవు.
ISTAR విమానాలు సేకరించిన సమాచారం తక్షణమే విశ్లేషించి, భూమిపై ఉన్న ఆర్మీ, నేవీ, వాయుసేన యూనిట్లకు పంపిస్తాయి. దాంతో వేగంగా నిర్ణయాలు తీసుకోవచ్చు.
బాలాకోట్, LAC ఘటనల అనంతరం మౌలిక లోపాలు బయటపడ్డాయి. సరిగ్గా సమయానికి నిఘా సమాచారం అందకపోవడం వల్ల సమస్యలు వచ్చాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ ISTAR ద్వారా శత్రు కదలికలపై ముందుగానే సమాచారం అందిస్తాయి. స్మార్ట్ మిస్సైల్ దాడులకు గైడెన్స్‌గా పనిచేస్తుంది. శత్రు దేశాల ప్రాంతాల్లోకి వెళ్లకుండానే మన భద్రతను బలోపేతం చేయొచ్చు.
55
మేక్ ఇన్ ఇండియా నినాదం
ఈ ISTAR విమానాలు బోయింగ్ లేదా బాంబార్డియర్ వంటి విదేశీ కంపెనీల నుంచైనా, వాటిలో ఉపయోగించే ప్రధాన సెన్సార్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు DRDO తయారు చేయబోతోంది. ఇలా వీటి తయారీలో భారత్ కూడా భాగస్వామ్యమవుతోంది.
సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి
అయితే ఈ విమానాల ఉపయోగంలో కొన్ని సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. అధునాతన డేటా వ్యవస్థలకు రక్షణ కోసం సైబర్ సెక్యూరిటీ పటిష్టంగా ఉండాలి. టెక్నాలజీతో పాటు వ్యూహాన్ని అర్థం చేసుకునే అనలిస్టులు పెద్ద ఎత్తున అవసరమవుతారు. మొత్తం మీద ఈ విమానాలతో శత్రుపై ముందస్తు విజయం సాధించవచ్చు. అధునాతన నిఘా సామర్థ్యం సొంతమవుతుంది. ఇది దేశీయ రక్షణ పరిశ్రమకు పెద్ద పురోగతిగా చెప్పొచ్చు.