Inspirational Story : డబుల్ మాస్టర్ డిగ్రీ చేసి ఐఏఎస్ కావాల్సినవాడు... చివరికిలా ఆటో డ్రైవర్ అయ్యాడు

Published : Jul 15, 2025, 06:45 PM ISTUpdated : Jul 17, 2025, 08:46 AM IST

బెంగళూరులో ఒక ఆటో డ్రైవర్ జీవిత కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబుల్ ఎమ్ఏ చేసి, ఏడు భాషలు మాట్లాడుతూ ఐఏఎస్ కావాలనుకున్న అతడు ఆటో డ్రైవర్ గా ఎలా మారాడో చెబుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. 

PREV
15
బెంగళూరు ఆటోడ్రైవర్ ఆదర్శ జీవితం

Hyderabad : పదో తరగతి, ఇంటర్ ఫెయిల్ అయినందుకే నేటితరం యువతీయువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉద్యోగం రాలేదనో, బిజినెస్ లో నష్టాలు వచ్చాయనో జీవితాన్ని భారంగా భావిస్తున్నవారు ఎందరో... ప్రతి చిన్న సమస్యను చూసి కంగారుపడేవారు ఎక్కువైపోతున్నారు.  అలాంటివారు ఈ ఆటోడ్రైవర్ జీవితాన్ని చూసి చాలా నేర్చుకోవాలి. జీవితమే తలకిందులైనా... ఐఏఎస్ కావాల్సినవాడు ఆటోడ్రైవర్ గా మారినా ఏమాత్రం బాధ లేకుండా ఎంత హాయిగా జీవిస్తున్నాడో తెలుసుకుందాం.

25
ఓ ఆటోడ్రైవర్ స్టోరీ ఇది...

ఎంత కష్టపడినా జీవితం కొన్నిసార్లు ఊహించని మలుపులు తిరుగుతుంది... కొంతమంది ఆ మలుపుల్లోనే కుంగిపోతారు. కానీ జీవితమంటే ఇది కాదని... ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు ఎదురైనా ధైర్యంగా స్వీకరిస్తూ ముందుకు సాగిపోవాలని నిరూపించాడు ఐటీ సిటీ బెంగళూరుకు చెందిన ఓ ఆటోడ్రైవర్. కష్టాలతో పోరాడుతూనే జీవితాన్ని అన్ని విధాలా ఆస్వాదిస్తూ ఈ ఆటో డ్రైవర్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ అయ్యాడు.

డబుల్ ఎమ్ఏ చేసి ఐఏఎస్ కావాలని కలలుగన్న ఓ ఆటో డ్రైవర్ స్టోరీ ఇది. ఏడు భాషలు అలవోకగా మాట్లాడుతూ అదరినీ ఆశ్చర్యపరుస్తున్న ఓ ఆటో డ్రైవర్ స్టోరీ ఇది. మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసి ఇప్పుడు ఆటో డ్రైవర్ గా మారినా ముఖంలో ఏమాత్రం బాధ లేకుండా హాయిగా జీవిస్తున్న ఓ ఆదర్శ వ్యక్తి స్టోరీ ఇది. ఆత్మగౌరవంతో బ్రతకాలి... అది ఐఏఎస్ అయినా, ఐటీ ఉద్యోగమైనా, ఆటో డ్రైవింగ్ అయినా ఒక్కటేనని అంటూ జీవిత సత్యాలు చెబుతున్న ఈ డ్రైవర్ మరో బుద్దుడిలా కనిపిస్తున్నాడు. 

35
ఆటో ప్రయాణంలో జీవితమంటే ఏంటో తెలిసింది...

బాగా చదివి ఐఏఎస్, ఐపిఎస్ కావాలని కలలుగన్న ఓ వ్యక్తి కుటుంబం కోసం ఐటీ ఉద్యోగిగా మారాడు. ఆ తర్వాత అతడి జీవితం అనేక మలుపులు తిరిగి ఆటో డ్రైవర్ గా మారాడు. కుటుంబ పరిస్థితులుఅతడు ఈ వృత్తి ఎంచుకోవడానికి కారణమయ్యాయి. కానీ జీవితంలో ఎదురైన ఈ కష్టాన్ని ఆయన ఎంతో సానుకూల దృక్పథంతో ఎదుర్కొంటున్న తీరే అందరినీ ఆకర్షిస్తోంది.

హైదరాబాద్ కు చెందిన కంటెంట్ క్రియేటర్ అభినవ్ మైలవరపు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఆటో డ్రైవర్ వీడియో వైరల్ అవుతోంది. బెంగళూరులో ఒక ఆటో డ్రైవర్ తో 15 నిమిషాలు జరిగిన సంభాషణ తన జీవితానికి ఎంతో గొప్ప పాఠం నేర్పిందని అభినవ్ వీడియోలో చెప్తున్నారు.

"నిన్న మేము బెంగళూరులో డీ-మార్ట్ కి వెళ్ళాం. తిరిగి వచ్చేటప్పుడు ఒక ఆటో ఎక్కాం. అప్పటినుండి ఓ 15 నిమిషాల ఈ ఆటో ప్రయాణం నా జీవితంలో మర్చిపోలేనివి" అంటూ అభినవ్ వీడియో మొదలుపెట్టారు.

45
కంప్యూటర్ ఫుల్ ఫార్మ్ ఏంటో తెలుసా?

ఆటో డ్రైవర్ అభినవ్ కి, అతని స్నేహితులకి ఒక చాలెంజ్ విసిరారు. అది గెలిస్తే ఆటోలో ప్రయాణించినందుకు డబ్బులు తీసుకోనని చెప్పారు. కంప్యూటర్ అనే పదానికి పూర్తి రూపం (ఫుల్ ఫార్మ్) చెప్పమన్నారు… చెప్తే డబ్బులు తీసుకోనన్నారు. అభినవ్ ఆండ్ ప్రెండ్స్ టీం చెప్పలేరని ఆయన నమ్మకం... నిజంగాను వాళ్లు చెప్పలేకపోయారు కూడా.

ఆ తర్వాత ఆటో డ్రైవర్ చెప్పిందేంటంటే... “చదువు సంపాదనకి ఉపయోగపడుతుంది, కానీ సంపాదన చదువుకి ఉపయోగపడదు. 1976 లో నేను చదువుకునేటప్పుడు కంప్యూటర్లు వస్తాయని చెప్పేవారు. ఇప్పుడు అందరూ AI గురించి మాట్లాడుకుంటున్నారు. కంప్యూటర్ అంటే Commonly Operated Machine Purposely Used for Trade, Education, and Research” అని ఆటో డ్రైవర్ వివరించారు. 

55
ఐఏఎస్ కాబోయి ఆటో డ్రైవర్

ప్రయాణంలో ఆటో డ్రైవర్ తన జీవిత కథని అభినవ్, అతని స్నేహితులకి చెప్పారు. "నేను ఐఏఎస్ కి ప్రిపేర్ అయ్యాను. నాకు డబుల్ ఎమ్ఏ ఉంది. ఒకటి ఇంగ్లీష్ లో, ఇంకొకటి పొలిటికల్ సైన్స్ లో. కానీ అకస్మాత్తుగా నా పెళ్లి నిశ్చయమైంది. పిల్లలు పుట్టారు. నేను చదువు కొనసాగించలేకపోయాను" అని ఆటో డ్రైవర్ చెప్పారు.

ఆటో డ్రైవర్ కి కన్నడతో సహా ఏడు భాషలు వచ్చని తెలిసి తమకు ఆశ్చర్యం వేసిందని అభినవ్ చెప్తున్నారు. వీడియోలో ఆటో డ్రైవర్ ఇలా చెప్పాడు. "ఇంగ్లీష్, హిందీ, కన్నడ, ఉర్దూ, తెలుగు, మలయాళం, తమిళం మాట్లాడగలను. నేను ఉర్దూ మాట్లాడే తీరు చూసి చాలామంది ముస్లిం అనుకుంటారు.. నేను చాలా MNC కంపెనీల్లో పనిచేశాను. వాళ్ళు చాలా డబ్బులు ఇస్తారు, కానీ చాలా పని చేయించుకుంటారు" అని ఆటో డ్రైవర్ చెప్పిన మాటలకు అభినవ్, అతని స్నేహితులు నివ్వెరపోయారు.

Read more Photos on
click me!

Recommended Stories