India Pakistan War : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్ధాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక తాజాగా ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరుదేశాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. భారత్-పాకిస్థాన్ పరస్పరం క్షిపణులు, డ్రోన్స్ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి నుండి పరిస్థితి మరింత దిగజారింది... భారత ఆర్మీ స్థావరాలే టార్గెట్ గా పాకిస్థాన్ దాడులకు తెగబడుతోంది. ఈ దాడులను సమర్ధవంతంగా తిప్పికొడుతూ ప్రతిదాడులకు దిగుతోంది భారత్.
ఇలా భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రికతల నేపథ్యంలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో ఒకటే దేశవ్యాప్తంగా ఏటిఎం బంద్స్. దేశంలో ఉద్రిక్త పరిస్థితుల వేళ బ్యాంకులు ఏటిఎంలను మూసివేయనున్నాయనే ప్రచారం జోరందుకుంది. మూడు రోజులపాటు ఏటిఎంలు క్లోజ్ కానున్నాయని సోషల్ మీడియాతో పాటు మిగతా మాధ్యమాల్లోనూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకటించింది.