5. శౌర్య - హైపర్‌సోనిక్ మిస్సైల్
శౌర్య హైపర్‌సోనిక్ వేగంతో ప్రయాణించే క్షిపణి. దీన్ని కెనిస్టర్ ద్వారా ప్రయోగించవచ్చు. ఇది 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తాకగలదు. దీనిని గుర్తించడం, తిప్పికొట్టడం చాలా కష్టమైన పని.
ఆపరేషన్ సింధూర్, తర్వాత జరిపిన దాడులతో ఈ క్షిపణుల యాక్టివేషన్ ద్వారా భారత్ తన రక్షణలో ఎంతగా సిద్ధంగా ఉందో ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. శత్రుదేశాలపై తక్షణ ప్రతీకార చర్యల్లో ఈ ఆయుధాలు కీలక పాత్ర పోషించగలవని రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి.