Honeymoon Murder case: మంగ‌ళ‌సూత్రం, టీష‌ర్ట్‌.. భ‌ర్త‌ను చంపిన భార్య‌ను ప‌ట్టించిన‌వి ఇవే..

Published : Jun 11, 2025, 04:25 PM ISTUpdated : Jun 11, 2025, 04:27 PM IST

ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. హనీమూన్‌ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లిన భార్య సోనం అతడిని కిరాయి హంతకులతో చంపించినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. 

PREV
16
పెళ్లి జరిగిన 10 రోజులకే

పెళ్లి జ‌రిగిన ప‌ది రోజుల్లోనే ఈ దారుణం జ‌ర‌గ‌డం అంద‌రినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. క‌ట్టుకున్న భ‌ర్త‌ను ప్రేమికుడి స‌హక‌రాంతో హ‌త్య చేయించ‌డంతో ప‌లు ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. 

ఇది కేవ‌లం ఒక నేరంగా మాత్ర‌మే కాకుండా దిగ‌జారుతోన్న మాన‌వ విలువ‌లు, ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోన్న బంధాలను ప్ర‌శ్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు ఈ హత్య జ‌ర‌గ‌డానికి ముందు చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌లు ఏంటి.? పోలీసులు ఈ కేసును ఎలా చేధించారు. ఇప్పుడు చూద్దాం..

26
హత్యకు ముందు చోటుచేసుకున్న ఘటనల క్రమం

మే 20: రాజా, సోనం దంపతులు ఇండోర్‌ నుంచి బయలుదేరి మొదట గువాహటిలోని కామాఖ్య దేవాలయాన్ని దర్శించారు. ఆ తర్వాత మే 21న మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ చేరుకున్నారు.

సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా సూచనలతో ముగ్గురు కిరాయి హంతకులు ఆకాశ్, ఆనంద్, వికాస్ ఇండోర్ నుంచి వేర్వేరు మార్గాల్లో షిల్లాంగ్‌కు వెళ్లారు. ఒక‌రితో ఒక‌రికి సంబంధం లేద‌ని భ్రమింప జేయ‌డానికి ముగ్గురు వేర్వేరు మార్గాల్లో షిల్లాంగ్‌కు చేరుకున్నారు.

36
మే 23: ట్రెక్కింగ్ పేరుతో చంపే కుట్ర

చిరపుంజి ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు రాజా, సోనం వెళ్లగా, కిరాయి హంతకులు అక్కడకు చేరుకుని రాజాను ప‌రిచ‌యం చేసుకున్నారు. తాము కూడా ఇండోర్ నుంచి వ‌చ్చామ‌ని మాట‌లు క‌లిపారు.

ఉదయం 10 గంటల సమయంలో స్థానిక గైడ్ ఆల్బర్ట్ త‌న సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని కోరారు. అయితే వారు గైడ్ అవ‌స‌రం లేద‌ని చెప్పి వెళ్లిపోయారు. ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లో భాగంగానే త‌మ వెంటా మ‌రో వ్యక్తి ఉండ‌కూడ‌ద‌ని ప్లానింగ్ వేశారు.

కొద్దిదూరం వెళ్లాక సోనం అలసటగా నడుస్తూ వెనుకపడింది. రాజా ముందుకు న‌డుస్తూ వెళ్లాడు. అంత‌లోనే "అతడిని చంపేయండి" అని కేక వేసింది. అప్పటికే సిద్ధంగా ఉన్న ముగ్గురు హంతకులు అతడిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. తల ముందు, వెనుక భాగాల్లో గాయాలయ్యేలా దాడి చేసి, రాజా మృతదేహాన్ని లోయలో పడేశారు.

46
హత్య అనంతర పరారీ

హ‌త్య చేసిన త‌ర్వాత సోనమ్‌ను ట్యాక్సీలో షిల్లాంగ్ పంపించారు. దీంతో ఆమె అక్కడి నుంచి గువాహటికి వెళ్లి, రైల్లో ఇండోర్‌కు చేరుకుంది. ముగ్గురు హంతకులు మరో ట్యాక్సీలో గువాహటికి వెళ్లి, అక్కడి నుంచి వేర్వేరు రైళ్లలో ఇండోర్‌కు వెళ్లారు.

సూత్రధారి ఇండోర్‌లోనే

అయితే ఈ మ‌ర్డ‌ర్‌కు ప్లాన్ చేసిన ప్ర‌ధాన సూత్ర‌ధారి సోనం ప్రియుడు రాజ్ కుష్వాహా మేఘాలయకు వెళ్లలేదు. అతను ఇండోర్‌లో ఉండి సోనమ్, హంతకుల మధ్య నిరంతరం సమన్వయం చేస్తూ హత్యను దూరం నుంచే నడిపించాడు.

56
పోలీసులు ఎలా ప‌ట్టుకున్నారు.?

ఘటనా స్థలికి సమీపంలో పోలీసులకు రక్తపు మరకలతో ఉన్న టీ షర్ట్‌ లభించింది. చిరపుంజికి భర్తతో బయలుదేరినప్పుడు సోనమ్‌ అదే టీ షర్ట్‌ ధరించి ఉండటాన్ని సీపీటీవీ ఫుటేజ్‌ల ద్వారా గుర్తించారు. అలాగే షిల్లాంగ్‌లోని హోటల్‌ లగేజిలో వదిలేసిన మంగళసూత్రాన్ని చూసి అనుమానం మొద‌లైంది. 

కొత్తగా పెళ్లైన మహిళ మంగళసూత్రం లేకుండా ఎలా ఉంటుందని అనుమానించారు. ఇవన్నీ బేరీజు వేసుకుని సోనమ్‌ బతికే ఉందని నిర్ధారణకు వచ్చారు. ఆ దిశ‌గా విచార‌ణ చేప‌ట్ట‌డంతో నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి.

66
ద‌ర్యాప్తులో విస్తుపోయే నిజాలు

భర్త రాజా రఘువంశీని చంపించేందుకు భార్య సోనమ్‌ రూ.20 లక్షల సుపారీ ఇచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది. తొలుత రూ.4 లక్షలు ఆఫర్‌ చేయగా, తర్వాత దాన్ని రూ.20 లక్షలకు పెంచినట్టు పోలీసులు తెలిపారు.

 ఇక రఘువంశీ అంత్యక్రియల్లో నింది తుడు రాజ్‌ కుష్వాహా పాల్గొన‌డం కొస‌మెరుపు. బాధపడవద్దంటూ అతడి తండ్రిని ఓదార్చాడు. ఈ విషయాన్ని రఘువంశీ కుటుంబ సభ్యులు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories