Honey Moon Murder Case: చంపేసింది చాలకా..ఏడేడు జన్మలకు నీవే తోడుగా ..అంటూ వాట్సాప్‌ స్టేటస్‌!

Published : Jun 11, 2025, 10:57 AM IST

ప్రియుడి కోసం భర్తను హనీమూన్ కి తీసుకుని వెళ్లి మరి హత్య చేసింది సోనమ్. కానీ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఏడేడు జన్మలకు నీవే తోడుగా అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి కవర్ చేసింది. కానీ నిజం బయటపడి కటకటాలు లెక్కపెడుతోంది.

PREV
16
నమ్మలేని నిజాలు

మేఘాలయ హనీమూన్‌ ప్రయాణంలో ఓ కొత్తజంట మిస్సింగ్‌ కేసు విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మే 11న వివాహం చేసుకున్న సోనమ్‌–రాజా రఘువంశీ జంట మే 20న హనీమూన్‌ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే మే 23న రాజా హత్యకు గురై, జూన్‌ 2న అతని మృతదేహం లోయలో కత్తిపోటులతో కనిపించింది.

26
పక్కాప్రణాళిక ప్రకారం..

సోనమ్‌ తన ప్రియుడు రాజ్‌ కుశ్వాహాతో కలిసి పథకం వేసి ఈ హత్యను జరిపించినట్లు పోలీసులు వెల్లడించారు. మొదట కిరాయి హంతకులకు రూ.4 లక్షలు ఇచ్చిన ఆమె, చివరికి ఆ మొత్తం రూ.20 లక్షలకు పెంచింది. రాజాను చిరపుంజీలోని జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడ కిరాయి హంతకులు అతడిని కత్తులతో హత్య చేసి, మృతదేహాన్ని లోయలో పడేశారు.

36
చాటింగ్‌లో భర్తపై అసహ్యం

రాజ్‌తో జరిపిన చాటింగ్‌లో “రాజా అంటే నాకు అసహ్యం, అతనితో శారీరకంగా కలవలేను” అని సోనమ్‌ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అతడిని ప్రేమించకుండానే పెళ్లి జరిగిందని, తన హృదయం రాజ్‌ కుశ్వాహాకే చెందినదని పేర్కొంది.

46
హత్య తర్వాత వాట్సాప్ స్టేటస్

 రాజా హత్యకు గురైన  కొద్ది గంటలకే  "ఏడు జన్మలోనూ నువ్వే నా తోడు" అంటూ సోనమ్‌ వాట్సప్ స్టేటస్ పెట్టినట్లు గుర్తించారు. రాజా ఇంకా బతికే ఉన్నాడని కుటుంబసభ్యులను మభ్యపెట్టడానికి ఇదే ప్రయత్నమని పోలీసులు చెప్పారు.

56
అంత్యక్రియల్లో రాజ్‌ కుశ్వాహా

అంత్యక్రియల్లో రాజ్‌ కుశ్వాహా, రఘువంశీ మృతదేహాన్ని ఇంద్రూర్‌కి తీసుకెళ్లే వాహనాల్లో ఒకదానిని నడిపినట్లు, అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు రాజా సోదరి పేర్కొంది. హత్యలో తన ప్రమేయం బయటపడకుండా ఉండేందుకే ఇలా నటించినట్లు అనుమానిస్తున్నారు.

66
దర్యాప్తులో కీలక మలుపులు

పోలీసుల విచారణలో సోనమ్‌, రాజ్‌ కుశ్వాహా ప్రేమ వ్యవహారం, కాల్ రికార్డులు, చాటింగ్ ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. హత్య తర్వాత నిందితులు అస్సాంలోని గువాహటికి వెళ్లి, అక్కడినుంచి విడివిడిగా పరారయ్యారు.

Read more Photos on
click me!

Recommended Stories