తేజస్ ఒక 4.5 జనరేషన్ మల్టీరోల్ యుద్ధ విమానం. ఈ విమానం ఆఫెన్సివ్ ఎయిర్ సపోర్ట్, క్లోజ్ కాంబాట్, గ్రౌండ్ అటాక్ మిషన్లు నిర్వహించేలా రూపొందించారు. హాల్ (HAL) వెబ్‌సైట్ ప్రకారం, తేజస్ కుటుంబంలో ఎయిర్ ఫోర్స్, నేవీ కోసం సింగిల్-సీట్ ఫైటర్ వెర్షన్లు, ట్రైనర్ వెర్షన్లు ఉన్నాయి.
తాజా LCA Mk1A వెర్షన్‌లో AESA రాడార్, ఆధునిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్, రాడార్ వార్నింగ్ సిస్టమ్, డిజిటల్ మ్యాప్ జనరేటర్, సురక్షిత రేడియో ఆల్టిమీటర్ వంటి అనేక సరికొత్త వ్యవస్థలు ఉన్నాయి. విమానం భారీ ఒత్తిడుల్లో కూడా మెరుగైన పనితీరును చూపిస్తుందని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
తేజస్ విమానం కోసం రూపొందించిన మార్టిన్–బేకర్ “జీరో–జీరో” ఎజెక్షన్ సీటు ప్రత్యేకత. ఇది విమానం నిశ్చలంగా పడిపోయే స్థితిలో ఉన్నప్పటికీ, పైలట్‌ను సురక్షితంగా బయటకు పంపుతుంది.