రైలులో పెంపుడు కుక్క‌ల‌ను తీసుకెళ్లొచ్చా.? ఇండియ‌న్ రైల్వే ఏం చెబుతోందంటే..

Published : Nov 21, 2025, 03:58 PM IST

Indian Railways: దేశంలో అతిపెద్ద ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఇండియ‌న్ రైల్వే అనే విష‌యం తెలిసిందే. ఈ సంస్థ‌కు సంబంధించి ఎన్నో నియ‌మ‌నిబంధ‌న‌లు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక రూల్ గురించి ఈరోజు తెలుసుకుందాం. 

PREV
15
రైలులో శున‌కాల‌ను తీసుకెళ్లొచ్చా.?

భారతీయ రైల్వేలో కుక్కలను తీసుకెళ్లడం అనుమతే. కానీ అందరి భద్రత, పరిశుభ్రత, ఇతర ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఈ నియమాల ప్రకారమే శున‌కాల‌తో ప్ర‌యాణించాల్సి ఉంటుంది.

25
ఫస్ట్ ఏసీ లేదా ఫస్ట్ క్లాస్‌లో ఎలా తీసుకెళ్లాలి?

ఫస్ట్ ఏసీ లేదా ఫస్ట్ క్లాస్‌లో కుక్కను యజమాని తనతోపాటు తీసుకెళ్లవచ్చు. కానీ ఒక షరతు ఉంది. ఇందుకోసం యజమాని మొత్తం క్యాబిన్‌ను పూర్తిగా బుక్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇతర ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండటానికి, అలాగే ఎవరికైనా అలర్జీ ఉన్నట్లయితే సమస్య రాకుండా ఉండటానికి పెట్టిన నియమం. క్యాబిన్ బుకింగ్ పూర్తయ్యాక, యజమాని అభ్యర్థనపై DRM లేదా GM ఆఫీస్ ఆమోదం ఇస్తుంది.

35
మిగతా కోచ్‌ల్లో ఎందుకు అనుమతి లేదు?

AC స్లీపర్, AC చైర్ కార్, స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ వంటి సాధారణ కోచ్‌ల్లో కుక్కలను తీసుకెళ్లటం పూర్తిగా నిషేధం. ఎందుకంటే. ఈ కోచ్‌ల్లో ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటారు. కుక్క‌ల వ‌ల్ల వారికి అసౌక‌ర్యం క‌లిగే అవ‌కాశం ఉంటుంది. అలాగే కొంద‌రిలో ఆరోగ్య సమస్యలు వ‌స్తాయి. అందువల్ల సాధారణ కోచ్‌ల్లో కుక్కలను ఓపెన్‌గా తీసుకెళ్లడానికి రైల్వే అనుమతి ఇవ్వదు.

45
క్యాబిన్ బుక్ చేయలేకపోతే?

క్యాబిన్ మొత్తం బుక్ చేయ‌డం అంద‌రికి సాధ్యం కాదు. అయితే ఇందుకోసం కూడా ఓ మార్గం ఉంది. కుక్కలను బ్రేక్/పార్సల్ వాన్‌లోని ప్రత్యేక డాగ్ బాక్స్‌లో తీసుకెళ్ల‌వ‌చ్చు. ఇది పెంపుడు జంతువుల కోసం తయారు చేసిన భద్రమైన స్థలం. ఇందుకోసం ముందుగా స్టేషన్‌లోని పార్సల్ ఆఫీస్‌లో బుకింగ్ చేయాలి. అక్క‌డ పెంపుడు శున‌కాన్ని పూర్తిగా చెక్ చేస్తారు. అవసరమైన వివరాలు నమోదు చేసి, రైలులోనే ఉండే డాగ్ బాక్స్‌లో ఉంచుతారు. ప్ర‌యాణం ముగిసిన త‌ర్వాత మీ శున‌కాన్ని తీసుకెళ్లొచ్చు.

55
చిన్న శున‌కాలు ఉంటే..

చిన్న పప్పీలు లేదా చిన్న పిల్లి పిల్లలు హ్యాండ్ బాస్కెట్ లేదా చిన్న క్యారియర్‌లో పడితే, అవి యజమాని దగ్గరే ఏ కోచ్‌లో అయినా తీసుకెళ్లవచ్చు. కేవలం చిన్న ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుతం పెంపుడు జంతువుల బుకింగ్ ఆన్‌లైన్‌లో లేదు. స్టేషన్‌లోని పార్సల్ బుకింగ్ ఆఫీస్‌కి వెళ్లి ప్రాసెస్ పూర్తిచేయాలి. ప్రయాణం మొదలు అయ్యే ముందు కనీసం 1–2 గంటల ముందుగానే స్టేషన్‌కి వెళ్లడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories