నెలకు లక్ష సంపాదిస్తున్న ర్యాపిడో డ్రైవ‌ర్‌.. ఇది క‌దా స‌క్సెస్ స్టోరీ అంటే

Published : Nov 21, 2025, 01:42 PM IST

Success story: డ‌బ్బు సంపాదించ‌డం ఎంత క‌ష్ట‌మో, అంతే సుల‌భం అని అంటుంటారు. అయితే మ‌న‌సుండాలే కానీ డ‌బ్బు సంపాద‌న గొప్ప విష‌యం కాద‌ని చెబుతున్నాడు ఓ ర్యాపిడో డ్రైవ‌ర్‌. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఆయ‌న గురించి చ‌ర్చ న‌డుస్తోంది. 

PREV
15
మూడు ఉద్యోగాలు..

పగలంతా డెలివరీ బాయ్‌గా పరుగులు.. సాయంత్రం రాపిడో రైడ్‌లు.. వారాంతాల్లో పానీ పూరి స్టాల్. మూడు పనులు ఒకేసారి చేస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్న యువకుడు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారాడు. కాపీరైటర్ కోమల్ పోర్వాల్ పంచుకున్న అనుభవం ఇంటర్నెట్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది. కోమ‌ల్ రాత్రి 9 గంటల సమయంలో కోమల్ రాపిడో బుక్ చేశారు. ప్రయాణం సాగుతుండగా డ్రైవర్‌తో మాట‌లు క‌లిపారు. మీరు ఈ ప‌నిని ఫుల్ టైమ్ చేస్తారా అని అన్నారు. దానికి డ్రైవ‌ర్ బ‌దులిస్తూ.. ఉదయం స్విగ్గీ కోసం ఫుడ్ డెలివరీలు, సాయంత్రం రాపిడో రైడ్‌లు, వీకెండ్స్‌లో తన అన్నతో కలిసి పానీ పూరి బండి న‌డిపిస్తాన‌ని చెప్పుకొచ్చాడు.

25
శ్ర‌మ ఎక్కువే కానీ..

ఒకేసారి మూడు ప‌నులు చేస్తున్నావు ఎలాంటి ఇబ్బంది లేదా అని అడ‌గ్గా.. పని కష్టమే.. కానీ మా ఇంట్లో చిరునవ్వులు కొనసాగుతున్నాయి అని చెప్పుకొచ్చాడు. రోజు లేటు నైట్ వరకూ పని చేసినా అలసట కన్నా సంతృప్తి ముఖంలో కనిపిస్తుందని చెప్పాడు. కోమ‌ల్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

35
నెల ఆదాయం తెలిస్తే షాక్‌

ఇంత కష్టంతో డ్రైవర్ ఎంత సంపాదిస్తున్నాడో కోమ‌ల్ అడిగారు. మూడు వనరుల నుంచి వచ్చే మొత్తం చూసి ఆమె స్టన్ అయ్యారంటా. ఫుడ్ డెలివ‌రీ, ర్యాపిడో రైడ్‌లు, వీకెండ్ పానీ పూరి స్టాల్‌తో క‌లిపి రూ. 95 వేల నుంచి రూ. ల‌క్ష సంపాదిస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు. ఇంత ఒత్తిడి ఉన్నా అతని ముఖంలో చిరునవ్వు, కళ్లలో సంతృప్తి.. అదే కోమల్‌ను ఎక్కువగా ప్రభావితం చేసింది.

45
యువ‌త ప‌ని చేయ‌దంటారా.?

కోమల్ తన పోస్ట్‌లో ఒక ముఖ్యమైన అంశాన్ని హైలైట్ చేశారు.. ఇప్పుడు యువ‌త క‌ష్ట‌ప‌డాల‌ని అనుకోవ‌డం లేద‌ని సమాజంలో తరచూ వినిపిస్తుంటుంది. ఈ యువకుడు ఆ భావన త‌ప్ప‌ని చెప్ప‌డానికి ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ పోస్ట్‌ను వేలా మంది షేర్ చేస్తున్నారు.

55
కేవ‌లం సంపాద‌న మాత్ర‌మే కాదు

ఈ క‌థ కేవ‌లం సంపాద‌నకు సంబంధించిన‌ది మాత్ర‌మేక కాదు.. ఇది అంకితభావం, గౌరవప్రదమైన శ్రమ, కుటుంబం కోసం పోరాటం, మానసిక బలము, ధైర్యం గురించి. నెటిజ‌న్లు దీనిపై ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. "ఆనందంగా పనిచేసేవారే జీవితంలో గెలుస్తారంటూ ఒక యూజ‌ర్ కామెంట్ చేయ‌గా.. కష్టపడి పనిచేసే మనసు ఉంటే విజ‌యం వ‌రిస్తుంద‌ని అంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories