11,558 రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివ‌రాలు ఇవిగో

First Published | Sep 3, 2024, 3:00 PM IST

RRB NTPC Notification 2024: RRB NTPC నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRBs) NTPC రిక్రూట్‌మెంట్ 2024 కోసం మొత్తం 11558 పోస్ట్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. 
 

RRB NTPC Notification 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెద్ద సంఖ్య‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చింది. సెప్టెంబర్ 2న ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్  రిక్రూట్‌మెంట్ 2024 కోసం అధికారికంగా నోటిఫికేషన్‌ను ఇచ్చింది.

భారతీయ రైల్వేలలో వివిధ నాన్-టెక్నికల్ కేటగిరీ (NTPC-నాన్ టెక్నికల్ కేటగిరీ) పోస్ట్‌లలో మొత్తం 11558 పోస్ట్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. RRB NTPC 2024 నోటిఫికేషన్‌లో 8113 పోస్టులు గ్రాడ్యుయేట్‌లకు రిజర్వ్ చేయబడ్డాయి. అలాగే, 3,445 పోస్ట్‌లు అండర్ గ్రాడ్యుయేట్‌లకు రిజర్వ్ చేశారు. 

రైల్వే మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌లో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం నాన్-టెక్నికల్ పాపులర్ క్లాసెస్ (NTPC) రిక్రూట్‌మెంట్ కింది పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించిందని తెలిపింది. అభ్య‌ర్థులు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాల‌నీ, ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 2న విడుదలైందని తెలిపింది.

అర్హత గల అభ్యర్థులు గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల‌నీ, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ప్రక్రియ, ఇతర సంబంధిత సమాచారాన్ని పంచుకుంది. 

RRB NTPC Notification 2024 మొత్తం ఖాళీలు

11558 గ్రాడ్యుయేట్ (లెవల్ 5, 6), అండర్ గ్రాడ్యుయేట్ (లెవల్ 2, 3) పోస్టులకు దరఖాస్తుల‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ ద్వారా భ‌ర్తీ చేస్తోంది. మొత్తం 11,558 పోస్టులను భర్తీ చేయనున్న‌ట్టు తెలిపింది. గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 14న ప్రారంభమవుతుంది. అక్టోబర్ 13 వరకు కొనసాగుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు ఉంటుంది.

అభ్య‌ర్థుల విద్యా అర్హ‌తలు ఏమిటి?

గ్రాడ్యుయేట్ పోస్టులలో చీఫ్ కమర్షియల్-కమ్-టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్, సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి.

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 12వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. అలాగే, గ్రాడ్యుయేట్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ తప్పనిసరిగా ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. 


ఏఏ పోస్టులు ఉన్నాయి?

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు

జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 పోస్ట్‌లు
అకౌంట్స్ క్లర్క్ (కమ్ టైపిస్ట్): 361 పోస్ట్‌లు
రైళ్లు క్లర్క్: 72 పోస్ట్‌లు
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2022 పోస్ట్‌లు

గ్రాడ్యుయేట్ పోస్టులు

గూడ్స్ రైలు మేనేజర్: 3144 పోస్ట్
చీఫ్ కామర్సియర్
పిస్ట్ : 732 పోస్టులు
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ : 1507 పోస్టులు
స్టేషన్ మాస్టర్ : 994 పోస్టులు

అభ్యర్థులకు వయోపరిమితి ఎంత?

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
గ్రాడ్యుయేట్ పోస్టుల అభ్యర్థుల వయస్సు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీల‌కు మూడు సంవ‌త్స‌రాలు, ఎస్టీ, ఎస్సీల‌కు ఐదు సంత్స‌రాల వ‌యోప‌రిమితి స‌డ‌లింపు ఉంటుంది. 

పరీక్ష విధానం ఏమిటి?

ఈ ఉద్యోగాల భ‌ర్తీ కోసం రెండు స్థాయిల ప‌రీక్ష‌లు ఉంటాయి. ఇవి ఆన్ లైన్ లో నిర్వ‌హిస్తారు. ఆన్‌లైన్ పరీక్ష స్థాయి 1 -CBT 1
ఆన్‌లైన్ పరీక్ష దశ 2 – CBT 2
టైపింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) / ఆప్టిట్యూడ్ టెస్ట్

ఆ త‌ర్వాత స‌ర్టిఫికేట్ల వేరిఫికేష‌న్ ఉంటుంది. ఇది పూర్తయిన త‌ర్వాత వైద్య పరీక్షలు ఉంటాయి. 

Image of Rail Job

ఎలా దరఖాస్తు చేయాలి?

అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్ లైన్ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. దీని కోసం..
ముందుగా RRB అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ని సందర్శించండి. ఆ త‌ర్వాత RRB NTPC 2024 నోటిఫికేషన్‌ను పూర్తిగా చ‌ద‌వండి. ప్రాథమిక వివరాలను తెలుసుకున్న త‌ర్వాత మీరు రిజిస్ట‌ర్ చేసుకోవాలి. 
మీ పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వంటి మీ ప్రాథమిక వివరాలను అందించడం ద్వారా రిజిస్ట‌ర్ చేసుకోవాలి.

 ఆ త‌ర్వాత లాగిన్ అయి ఖచ్చితమైన సమాచారంతో దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఆ త‌ర్వాత పేమెంట్ ఆప్ష‌న్ వ‌స్తుంది. దరఖాస్తు రుసుము ఆన్ లైన్ లోనే చెల్లించాలి. పూర్తి చేసిన దరఖాస్తును గడువు తేదీలోగా సమర్పించాలి.

Latest Videos

click me!