Mumbai
తీరప్రాంత నగరమైన ముంబై సముద్ర మట్టం పెరుగుదల వల్ల తీవ్ర ముప్పును ఎదుర్కొంటుంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం పెరుగుతూ వస్తోంది. ఇదే స్థాయిలో అరేబియా సముద్రమట్టం పెరుగుతూ ఉంటే 2050 నాటికి ముంబై నగరంలోని అధికభాగం నీట మునిగిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇండియాలోని సముద్రతీర నగరాలకు భవిష్యత్ లో ప్రమాదం పొంచివవుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ (IPCC) తెలిపింది. ఇలా ప్రమాదం పొంచివున్న నగరాల్లో ముంబైతో పాటు మరికొన్ని తీరప్రాంతాలు వున్నాయి.
Kolkata
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా కూడా సముద్ర మట్టానికి దగ్గరగా ఉంది. అలాగే అనేక నదులు ఈ నగరాన్ని చుట్టుముట్టి ఉన్నాయి. ఈ నగరానికి సముద్ర మట్టం పెరుగుదల, నదుల వరదల కాారణంగా ప్రమాదం ఉంది. సుందర్‌బన్స్, కోల్‌కతా చుట్టూ ఉన్న ఇతర దిగువ ప్రాంతాలు తరచుగా వరదలకు గురవుతుంటాయి... ఇదే పరిస్థితి కొనసాగితే కోల్‌కతాలోని అధికభాగం నీట మునిగిపోతుందని హెచ్చరించారు. .
Chennai
చెన్నై కూడా సముద్ర మట్టం పెరుగుదల ముప్పును ఎదుర్కొంటోంది. తీరప్రాంత కోత, పెరుగుతున్న వరదలు ఈ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ఇటీవల భారీ వర్షాల కారణంగా చెన్నై నగరమంతా నీటమునిగింది, భూగర్భ జలాలను అతిగా తోడడం, నీటి నిర్వహణ పద్ధతులు సరిగా లేకపోవడం వల్ల ఈ నగరం చాలా ఇబ్బందులను ఎదుర్కుంటోంది.
Pandichery
కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి ఉనికి కూడా ప్రమాదంలో పడింది. సముద్ర మట్టం పెరుగుదల వల్ల ఈ ప్రాంతం పాక్షికంగా ప్రభావితమవుతోంది. ఇసుక తవ్వకం వంటి మానవ కార్యకలాపాల వల్ల ముప్పు వాాటిల్లుతోంది. తుఫానులకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం వినాశకరమైన అనేక తుఫానులు , వరదలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీనివల్ల ఇది మునకకు గురవుతుందట.
Surat
గుజరాత్‌లోని ప్రముఖ నగరమైన సూరత్ తాప్తి నది ఒడ్డున ఉంది. ఈ నగరం నది కోత, వరద ముప్పును ఎదుర్కొంటోంది. ఈ నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయే ప్రమాదం ఉంది.
Vizag
ఆంధ్ర ప్రదేశ్ లోని సముద్ర తీర నగరం విశాఖపట్నంకు కూడా ప్రమాదం పొంచివుందట. మొత్తంగా ముంబై, చెన్నై, పాండిచ్చెరి, సూరత్, విశాఖ నగరాలతో పాటు కొచ్చి, భావ్ నగర్, మంగుళూరు, ట్యుటికోరన్, కాండ్లా, ఓఖా, మార్మగోవా, పారాదీప్, ఖిధిర్ పూర్ వంటి 12 నగరాలు మునిగిపోయే ప్రమాదం వుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ హెచ్చరించింది.