దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు ఏదో తెలుసా? స్పీడ్ తెలిస్తే షాక్ అవుతారు

First Published | Sep 2, 2024, 9:21 PM IST

భారతదేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఏదో తెలుసా..? ఆ రైలు ఎక్కడి నుండి ఎక్కడి ప్రయాణిస్తుంది? ఎంత సమయంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? తదిరత విషయాలు తెలుసుకుందాం. 

స్పీడెస్ట్ ట్రైన్

భారతీయ రైల్వే ఉత్తరప్రదేశ్‌ నుండి న్యూఢిల్లీకి కొత్త హై-స్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది. ఆగ్రా- ఢిల్లీ మధ్య దూరాన్ని ఈ రైలు కేవలం 1 గంట 30 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు సర్వీసులలో ఒకటి.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, న్యూఢిల్లీ మధ్య 160 కి.మీ వేగంతో నడుస్తుంది. అదే మార్గంలో ఇతర రైళ్లు   200 కి.మీ ప్రయాణించడానికి 2 నుండి 4 గంటల సమయం పడుతుంది. 


వందే భారత్ ఎక్స్‌ప్రెస్

16-కోచ్‌ల రైలు ఆగ్రా, లక్నో స్టేషన్ల ద్వారా న్యూఢిల్లీకి చేరుకుంటుంది. వందే భారత్ 150 నుండి 200 కి.మీ దూరంలో ఉన్న నగరాలను కలపడానికి రూపొందించబడింది. 2024 నాటికి, భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్.

ఈ రైలును ట్రైన్ 18 అని కూడా పిలుస్తారు, ఇది గంటకు 180 కిలోమీటర్ల (గంటకు 112 మైళ్లు) వేగంతో నడుస్తుంది. అయితే, భద్రత, ఆపరేషనల్ కారణాల దృష్ట్యా, ఇది సాధారణంగా గంటకు 160 కిలోమీటర్ల (గంటకు 99 మైళ్లు) వేగంతో నడుస్తుంది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది 2018లో ప్రవేశపెట్టబడిన ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (EMU). ఇది కవచ్ టెక్నాలజీ, 360-డిగ్రీలు తిరిగేలా కుర్చీలు, దివ్యాంగులకు అనుకూలమైన టాయిలెట్లు, ఇంటిగ్రేటెడ్ బ్రెయిలీ సిగ్నేజ్‌తో సహా మెరుగైన భద్రతా ప్రమాణాలు, సౌకర్యాలను కలిగి ఉంది.

Latest Videos

click me!