గ్యాస్‌ను ఆదా చేయడం కోసం మీ కడుపు మాడ్చుకోవాల్సిన పని లేదు.. సరైన టెక్నిక్స్‌తో రుచికరమైన అహారం తింటూ కూడా ఆదా చేసుకోవచ్చు. చాలా ఇళ్లలో స్టవ్ మంటలో 40 నుంచి 60% మాత్రమే వంటకు ఉపయోగపడుతుంది... మిగిలిన వేడి వృధా అవుతుంది. సరైన పద్ధతులు పాటిస్తే గ్యాస్ వాడకాన్ని 50% వరకు తగ్గించవచ్చు.
1. నానబెట్టిన పప్పు, బియ్యం లేదా కూరగాయలను ప్రెషర్ కుక్కర్‌లో ఉడికిస్తే 50-70% గ్యాస్ ఆదా అవుతుంది.
2. పప్పు, రాజ్‌మా, బియ్యం వంటివి ముందే నానబెట్టండి.
3. మూత లేకుండా వండితే ఆవిరి బయటకు పోయి గ్యాస్ ఎక్కువ ఖర్చవుతుంది. మూతపెట్టి వండితే 20-30% గ్యాస్ ఆదా చేయొచ్చు.
4. చిన్న గిన్నెను పెద్ద బర్నర్‌పై పెడితే మంట బయటకు వెళ్లి గ్యాస్ వేస్ట్ అవుతుంది. చిన్న గిన్నెకు చిన్న బర్నర్, పెద్ద గిన్నెకు పెద్ద బర్నర్ వాడండి. దీనివల్ల 6-10% గ్యాస్ ఆదా అవుతుంది.
5. బర్నర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి.
6. వంటకు ముందే కూరగాయలు తరగడం, మసాలాలు సిద్ధం చేసుకోవడం వంటివి చేయండి. పొయ్యిపై వంటపాత్ర పెట్టాక ఇవన్నీ చేయడంవల్ల గ్యాస్ వృధా అవుతుంది.
7. అన్నం, కిచిడీ, ఉడికించిన కూరగాయలు ఆవిరి మీద కూడా ఉడుకుతాయి. వాటిని సగం ఉడికించి, బర్నర్ ఆపేసి ఆవిరిపై మగ్గనివ్వండి.
8. వీలైతే పప్పు, అన్నం, కూరగాయలు ఒకేసారి కుక్కర్‌లో వండండి (బ్యాచ్ కుకింగ్). దీనివల్ల LPG తక్కువ ఖర్చవుతుంది.