Delhi Tourism : చలికాలంలో ఢిల్లీ గాలిలో ఒక ప్రత్యేకమైన మ్యాజిక్ ఉంటుంది. ఎప్పుడూ గాలి కాలుష్యంతో వార్తల్లో ఉండే డిల్లీ శీతాకాలం వచ్చిందంటే పొగమంచుతో మరింత బ్యూటిఫుల్ గా మారే పర్యాటక ప్రదేశాలతో వార్తల్లో ఉంటుంది. లేత ఎండ, చల్లని గాలులు, ఆకాశంలో ఎగిరే పక్షులతో ఈ పురాతన నగరం ప్రత్యేక అందాలను సంతరించుకుంటుంది. మీరు ప్రతి వీకెండ్ కేవలం కేఫ్‌లు లేదా క్లబ్‌లలో గడపడానికి అలవాటు పడితే ఈసారి కొత్తగా ప్రయత్నించండి.
దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలంలో మరింత అందంగా, చూడదగినవిగా మారే అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఫ్రేమ్ ఇన్‌స్టాగ్రామ్‌కు పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతుంది... ప్రతి దృశ్యం ఓ కళాఖండమే. ఈ శీతాకాలంలో ఓ వీకెండ్ మీకు గుర్తుండిపోయేలా ఉండాలంటే డిల్లీలోని ఈ ఐదు ప్రదేశాలను తప్పక చూడాల్సిందే.
26
యమునా ఘాట్
ఢిల్లీలోని హడావిడి జీవితం నుంచి కొన్ని క్షణాలు ప్రశాంతంగా గడపాలనుకుంటే యమునా ఘాట్ కంటే మంచి ప్రదేశం మరొకటి లేదు. చలికాలం ఉదయాన్నే ఇక్కడ వందలాది సీగల్ పక్షులు ఎగరడం సినిమా సీన్ ను తలపిస్తుంది. సూర్యుని మొదటి కిరణం నది నీటిపై పడగానే, వాతావరణం మొత్తం బంగారు రంగులోకి మారిపోతుంది. ఈ ప్రదేశం ముఖ్యంగా ఫోటోగ్రాఫర్లకు, ప్రకృతి ప్రేమికులకు స్వర్గం కంటే తక్కువ కాదు. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య ఇక్కడికి చేరుకుని, ఢిల్లీ చల్లని ఉదయాన్ని మీ కెమెరాలో బంధించవచ్చు.
36
హుమాయున్ సమాధి
చలికాలంలో హుమాయున్ సమాధి చాలా సినిమాటిక్‌గా కనిపిస్తుంది. లేత పొగమంచు, ఎండ మధ్య ఎర్ర ఇసుకరాయితో కట్టిన ఈ భవనం ఏదో చారిత్రక సినిమా సెట్‌లా అనిపిస్తుంది. చుట్టూ తోటలు, ప్రశాంతత, అద్భుతమైన దృశ్యాలు ఈ ప్రదేశాన్ని వీకెండ్ విహారయాత్రకు పర్ఫెక్ట్‌గా చేస్తాయి. రద్దీని తప్పించుకుని కొన్ని ఫోటోలు, రీల్స్ తీయడానికి ఉదయాన్నే వెళ్లడం మంచిది.
మీకు చరిత్ర, ప్రకృతి రెండూ ఇష్టమైతే కుతుబ్ మినార్ దగ్గర ఉన్న మెహ్రౌలీ పార్క్‌ను తప్పకుండా సందర్శించండి. ఇక్కడ పాత సమాధులు, శిథిలాలు, చెట్లతో నిండిన దారుల్లో నడవడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఈ ప్రదేశం ఫోటోగ్రఫీ, మార్నింగ్ వాక్ లేదా స్నేహితులతో చిన్న అడ్వెంచర్ ట్రిప్ కోసం చాలా బాగుంటుంది.
56
సుందర్ నర్సరీ
ఢిల్లీలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి సుందర్ నర్సరీ... ఇది చలికాలంలో పూర్తి అందాన్ని సంతరించుకుంటుంది. ఇక్కడి హెరిటేజ్ గార్డెన్స్, వాటర్ ఫీచర్స్, లైవ్ మ్యూజిక్ గిగ్స్ కలయిక అన్ని వయసుల వారికి పర్ఫెక్ట్ ఔటింగ్ స్పాట్‌గా ఉంటుంది.
66
హౌజ్ ఖాస్ కోట
ఢిల్లీలోని అత్యంత పిక్చర్-పర్ఫెక్ట్ స్పాట్‌లలో హౌజ్ ఖాస్ ఒకటి. సాయంత్రం కాగానే సరస్సు ఒడ్డు నుంచి కనిపించే సూర్యాస్తమయం, చుట్టూ ఉండే సందడి ఈ ప్రదేశానికి ఒక రొమాంటిక్ టచ్ ఇస్తాయి. మీరు ముందుగా కోట లోపల తిరిగి, ఆ తర్వాత ఏదైనా కేఫ్‌లో కూర్చుని కాఫీతో సాయంత్రాన్ని ఆస్వాదించవచ్చు.