డిమార్ట్‌లో షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్త.. ఇకపై ఇలా చేసారో ఇబ్బందిపడతారు

Published : Aug 23, 2025, 11:19 PM IST

ఇరపై డిమార్ట్‌లో షాపింగ్ చేసేటపుడు జాగ్రత్త.. మీరు సరదాకోసమో లేక ఉద్దేశపూర్వకంగానో చేసే కొన్ని పనులు ఇబ్బందులు కలిగించవచ్చు. 

PREV
15
ఇక డిమార్ట్ లో జాగ్రత్త

DMart .. ఇది మద్యతరగతి ప్రజల కిరాణాషాప్ గా గుర్తింపుపొందిన సూపర్ మార్కెట్. సాధారణ మార్కెట్ ధరల కంటే కాదు తయారుచేసే కంపెనీలు నిర్ణయించిన MRP (Maximum Retail Price) కంటే తక్కువ ధరకే వస్తువులను వినియోగదారులకు అందిస్తుందీ ఈ డీమార్ట్. అందుకే నిత్యావసర సరుకుల ఖర్చులు తగ్గించుకోవాలనుకునే మధ్యతరగతి జీవులు డీమార్ట్ కు క్యూ కడుతుంటారు. 

దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో డీ-మార్ట్స్ ఉన్నాయి… ఇక హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో అయితే ఏరియాకొకటి చొప్పున ఉన్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు డీమార్ట్ లో రద్దీ పెరిగిపోతుంది.. ఈ సమయంలోనే చిన్నచిన్న దొంగతనాలు కూడా జరుగుతుంటాయి. కొందరు వినియోగదారులు సరదాకు అహార పదార్థాలు తినడం, మరికొందరు కూల్ డ్రింక్స్ తాగి ఖాళీ బాటిల్స్ అక్కడే పెట్టేయడం వంటివి చేస్తుంటారు. ఇంకొందరు చిన్నచిన్న వస్తువులను దొంగిలిస్తుంటారు. ఇటీవల కాలంలో ఇలాంటి దొంగతనాలు పెరగడంతో డీమార్ట్ ఆదాయానికి గండి పడుతోంది. అందుకే ఇలాంటి చర్యలను అరికట్టేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

25
డి-మార్ట్ లో దొంగతనాలు

డిమార్ట్‌లో కొందరు బిల్లింగ్ కాకుండానే చాక్లెట్లు, స్నాక్స్ తింటుంటారు.. పెర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్, చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తుంటారు. ట్రయల్ రూమ్స్ లో సిసి కెమెరాలు ఉండవుకాబట్టి అక్కడే ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటారు. పేరెంట్స్ కలిసివచ్చే కొందరు చిన్నపిల్లలు తెలియకుండా కొన్ని వస్తువులను ఓపెన్ చేస్తుంటారు… ఎవరూ చూడట్లేదు కదా అని పేరెంట్స్ వారిని వారించే ప్రయత్న చేయరు. ఇలాంటివి డీమార్ట్ లో నిత్యకృత్యంగా మారాయి… కొన్నిచోట్ల సీసీ కెమెరాలు లేకపోవడంతో దీన్ని పూర్తిగా అరికట్టలేకపోతున్నారు.

35
డి-మార్ట్ ఆదాయానికి గండి

షాపింగ్ కు వచ్చిన కొందరు కావాలనే తమకు నచ్చిన చిన్నపాటి వస్తువులను బ్యాగుల్లో లేదా దుస్తుల్లో దాచి తీసుకెళ్తుంటారు. ఇలా అహారపదార్థాలు తినడం, వస్తువులను దొంగిలించడం ద్వారా భారీగా నష్టం కలుగుతోంది. ఓ అనధికారిక అంచనా ప్రకారం డీమార్ట్ లో జరిగే ఇలాంటి చర్యల వల్ల రోజుకు రూ.5,000 నుండి రూ.10,000 వరకు నష్టం వస్తోందని సమాచారం.

45
డీమార్ట్ కస్టమర్లూ... జాగ్రత్త

దొంగతనాలను అరికట్టడానికి డిమార్ట్ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఖరీదైన వస్తువులను లాక్ చేసిన అరల్లో ఉంచుతోంది.. వీలైనన్ని ఎక్కువ సీసీటీవీ కెమెరాలను వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. స్మార్ట్ సెన్సార్ వంటి సాంకేతికతను కూడా ఉపయోగిస్తోంది. ఇవి దొంగతనాలను కొంతవరకు తగ్గించినప్పటికీ సమస్య పూర్తిగా తొలగించలేకపోతున్నాయి. అందుకే సెక్యూరిటీ సిస్టమ్ ని మరింత మెరుగుపర్చడంపై డీమార్ట్ యాజమాన్యం ప్రత్యేకదృష్టి పెట్టింది. 

55
డి-మార్ట్ సీరియస్ యాక్షన్

కొన్నిసార్లు దొంగతనం చేసేవారు దొరికితే సిబ్బందితో గొడవలు కూడా జరుగుతున్నాయి. "మీకు ఇంత బిజినెస్ కావడానికి ప్రధాన కారణమైన వినియోగదారులనే  దొంగల్లా చూస్తారా?" అని కస్టమర్లే ప్రశ్నిస్తుంటారు. కాబట్టి వినియోగదారులు ఏం చేసినా సిబ్బంది కూడా చూసిచూడనట్లు వదిలిపెడుతుంటారు. 

అయితే కస్టమర్లకు అవగాహన కల్పించడం, చట్టపరమైన చర్యలు, కఠిన శిక్షల ద్వారా దొంగతనాల సమస్యను తగ్గించుకోవాలని డీమార్ట్ చూస్తోంది. అందుకోసం సాంకేతికతను ఉపయోగించడంతో పాటు కఠిన చర్యలకు సిద్దమయ్యింది. కాబట్టి ఇకపై డీమార్ట్ లో షాపింగ్ సమయంలో కస్టమర్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి… సరదాకు కూడా వస్తువులను ఓపెన్ చేయడం, స్నాక్స్ వంటివి తింటే ఇబ్బందిపడాల్సి వస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories