Railways : వారెవ్వా.. వందేభారత్ తో పోటీ..! భారతదేశంలో టాప్ 5 ఫాస్టెస్ట్ ట్రైన్స్

Published : Aug 02, 2025, 01:45 PM ISTUpdated : Aug 02, 2025, 01:50 PM IST

Fastest Trains in Indian : వందేభారత్ రైలే ప్రస్తుతం దేశంలో అత్యధిక స్పీడ్ తో నడిచే రైలు. కానీ దానితో పోటీపడుతూ నడిచే హైస్పీడ్ రైళ్లు మరికొన్ని ఉన్నాయి. వాాటిగురించి తెలుసుకుందాం. 

PREV
16
భారతీయ రైల్వేలో అత్యంత వేగంగా నడిచే రైళ్లు ఇవే

Indian Railways :మనిషి రాతియుగం నుండి రాకెట్ యుగానికి చేరుకున్నాడు. టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నకొద్దీ కొత్తకొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి... వీటితో తన జీవనం మరింత సౌకర్యవంతంగా మార్చుకున్నాడు. ఇలా అన్నిరంగాల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి... రవాణా రంగం కూడా ఊహించని విధంగా మారింది. ఒకప్పుడు 40-50 కిలోమీటర్ల ప్రయాణానికే ఓ రోజంతా పట్టేది... కానీ ఇప్పుడు క్షణాల్లో దేశాలు, ఖండాలు దాటే పరిస్థితి ఉంది.

వేగవంతమైన ప్రయాణం అభివృద్ధిని సూచిస్తుంది... అందుకే రవాణా వ్యవస్థను మెరుగుపర్చుకునేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి చాలా దేశాలు. ఇలా భారత్ కూడా ఇప్పటికే రోడ్డు, జల, వాయు రవాణా మార్గాల్లో మరింత మెరుగ్గా, వేగంగా ప్రయాణసదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే గంటకు 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే హైపర్ లూప్ వ్యవస్థలపై ప్రయోగాలు చేస్తోంది. అలాగే ఇప్పటికే గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ ట్రైన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇలా ఇండియన్ రైల్వేల రూపురేఖలు మార్చే ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే రైల్వే చరిత్రలోని అత్యధిక వేగంతో నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ లు అందుబాటులోకి వచ్చాయి. అయితే హైపర్ లూప్, బుల్లెట్ ట్రైన్స్ స్థాయిలో కాదుగానీ ఈ వందేభారత్ తో పోటీపడే స్థాయిలో వేగంగా నడిచే రైళ్లు కొన్ని గతంలోనే ఉన్నాయి. ఇలా ప్రస్తుతం దేశంలో టాప్ స్పీడ్ రైళ్లేవో ఇక్కడ తెలుసుకుందాం.

DID YOU KNOW ?
విమానంకంటే వేగంగా నడిచే వెహికిల్
హైపర్‌లూప్ మోడల్‌ను విమాన వేగం కంటే ఎక్కువవేగంగా ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు. గంటకు 1,000 నుంచి 1,800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ప్రయోగాలు జరుగుతున్నాయి.
26
1. వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express)

ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్. దీని గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు (టెస్టింగ్ సమయంలో). కానీ సాధారణంగా గంటకు 160 కి.మీ ఆపరేషన్ స్పీడ్... అంటే ప్రస్తుతం నడిచే స్పీడ్.

దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ ఈ వందేభారత్ రైల్వే సర్వీసులున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్-విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తోంది. ఈ రైలు వేగంగా ప్రయాణించడమే కాదు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది… కాబట్టి ఇందులో ప్రయాణాన్ని చాలామంది ఇష్టపడుతున్నారు.

36
2. గతిమాన్ ఎక్స్ ప్రెస్ (Gatimaan Express)

వందేభారత్ రైలుతో పోటీపడి మరి గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది గతిమాన్ ఎక్స్ ప్రెస్. ఇది దేశ రాజధాని న్యూడిల్లీ, ఉత్తరప్రదేశ్ లోని చారిత్రక నగరం ఝాన్సి మధ్య రాకపోకలు సాగిస్తుంటుంది. 2016 లొ దీన్ని ప్రారంభించారు... ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.

భారతదేశంలో మొట్టమొదటి సెమీ-హై స్పీడ్ రైలు ఈ గతిమాన్ ఎక్స్ ప్రెస్. ఇందులో అందమైన ఇంటీరియర్ తో పాటు ప్రయాణికులకు వైఫై, భోజన సదుపాయం కూడా ఉంటుంది. ఈ రైలులో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

46
3. తేజస్ ఎక్స్ ప్రెస్ (Tejas Express)

భారతీయ రైల్వే నడిపే సెమీ హైస్పీడ్ రైళ్లలో ఈ తేజస్ ఒకటి. అత్యాధునిక సౌకర్యాలతో అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. దీని గరిష్ఠ వేగం 130–160km/h... పలుచోట్ల ట్రాక్ ను బట్టి స్పీడ్ మారుతుంది. ఇది పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ రైలు. ముంబయి–గోవా, చెన్నై–మదురై, అహ్మదాబాద్–ముంబయి, లక్నో–న్యూ ఢిల్లీ మధ్య ఈ తేజస్ రైళ్ళు నడుస్తున్నాయి. ఇందులో స్మార్ట్ ఫీచర్లు, డిజిటల్ ఎంటర్టైన్మెంట్, ఆధునిక భద్రతా పద్ధతులను ఉపయోగించారు.

56
4. భోపాల్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ (Bhopal Shatabdi Express)

భోపాల్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ కూడా వందే భారత్ సమాన వేగాన్ని కలిగివుంటుంది. దేశ రాజధాని న్యూడిల్లీ, బోపాల్ మధ్య రాకపోకలు సాగించే ఈ శతాబ్ది ఎక్స్ ప్రెస్ గరిష్టంగా గంటకు 150km వేగంతో ప్రయాణిస్తుంది. ఇదికూడా పూర్తిస్థాయి ఏసీ కోచ్ లను కలిగివుంటుంది.

66
5. ముంబయి రాజధాని ఎక్స్ ప్రెస్ (Mumbai Rajdhani Express)

దేశ పరిపాలన రాజధాని న్యూడిల్లీ, ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై మధ్య ఈ రాజధాని ఎక్స్ ప్రెస్ నడుస్తుంది. దీని గరిష్ట వేగం 140–160km/h.ఇది చాలా ప్రీమియం సర్వీస్... ఇందులో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories