ఫాస్టాగ్​ వార్షిక పాస్ : రూ.3వేలతో ఏడాదంతా టోల్ ఫ్రీ జర్నీ.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?

Published : Aug 15, 2025, 05:50 PM IST

FASTag Annual Pass Launched: తరచుగా ప్రయాణించే ప్రైవేట్ వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప అవకాశాన్ని ప్రకటించింది. నేటీ నుంచి FASTag వార్షిక పాస్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఎలా పొందాలి? ప్రయోజనాలు, పరిమితులు మీ కోసం.. 

PREV
15
రూ.3వేలతో ఏడాదంతా టోల్ ఫ్రీ జర్నీ

FASTag Annual Pass Launched: దేశంలో రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్రప్రభుత్వం నేటీ నుంచి (ఆగస్ట్​ 15) ఫాస్టాగ్​ వార్షిక పాస్​ అందుబాటులోకి తీసుకవచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రం ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను విడుదల చేస్తుంది. ఈ పాస్ ద్వారా ఒకేసారి రూ. 3,000 చెల్లించి హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ఒక ఏడాది లేదా 200 ట్రిప్పుల వరకు టోల్ ఫ్రీ ప్రయాణం చేయవచ్చు. వార్షిక పాస్ ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటి వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే.. ఎలా తీసుకోవాలి? ఎలా అప్లై చేయాలని అనేది తెలుసుకుందాం.

25
FASTag వార్షిక పాస్ అంటే ఏమిటి?

FASTag వార్షిక పాస్ అనేది ఒక ప్రత్యేక సేవ, దీన్ని యాక్టివేట్ చేసిన తర్వాత, ఎంపిక చేసిన జాతీయ రహదారులు (NH), జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలు (NE)లో ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్పులు (ఏది ముందుగా వస్తుందో అది) కోసం ఉపయోగించవచ్చు. ఈ పాస్ ఉన్నప్పుడు, ప్రతి ట్రిప్ కోసం టోల్ చెల్లింపులు అవసరం ఉండవు. ఇది ప్రైవేట్ కారు, జీప్, వ్యాన్ వంటి వాహనాలకు వర్తిస్తుంది. 

సాధారణ టోల్ చెల్లింపుతో పోలిస్తే, రూ. 3,000 వార్షిక పాస్ ద్వారా సుమారు 70% తగ్గింపు పొందవచ్చని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ పాస్ తరచుగా ప్రయాణించే వాహనదారులకు, ప్రత్యేకంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు తరచుగా ఉపయోగించే వారు, పెద్ద మొత్తంలో ఆదా అవకాశాన్ని అందిస్తుంది.

35
ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?

ఆన్‌లైన్‌లో FASTag వార్షిక పాస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే? 

  1. ఆండ్రాయిడ్ లేదా iOS కోసం రాజ్‌మార్గయాత్ర మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేయండి లేదా NHAI వెబ్‌సైట్ ను సందర్శించండి.
  2. మీ మొబైల్ నంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వండి. వాహనం, FASTag వివరాలను సరైనంగా నమోదు చేయండి.
  3. FASTag సరిగ్గా ఇన్‌స్టాల్ చేయబడిందో, లింక్ అయ్యిందో, యాక్టివ్‌ గా ఉందో తనిఖీ చేయండి.
  4. ఆ తరువాత అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ చెల్లింపు ద్వారా రూ. 3,000 ఫీజు చెల్లించండి.
  5. చెల్లింపు విజయవంతమైన తర్వాత, మీ వార్షిక పాస్ FASTag కు లింక్ చేయబడుతుంది.
45
FASTag వార్షిక పాస్ చెల్లుబాటు:
  • వార్షిక పాస్ యాక్టివేషన్ తేదీ నుండి ఒక సంవత్సరం లేదా 200 లావాదేవీలు (ట్రిప్పులు) ఏది ముందుగా వస్తే దానివరకు చెల్లుతుంది.
  • 200 ట్రిప్పులు పూర్తయిన తర్వాత లేదా ఒక సంవత్సరం ముగిసిన తర్వాత, పాస్ స్వయంచాలకంగా సాధారణ FASTagకి మారుతుంది.
  • వార్షిక పాస్ ప్రయోజనాలను కొనసాగించాలంటే.. వినియోగదారు తరువాత 200 ట్రిప్పులు / 1 సంవత్సరం కోసం పాస్‌ను తిరిగి యాక్టివేట్ చేయాలి.
  • ఈ విధంగా, వార్షిక పాస్ వాడకం లావాదేవీల పరిమితికి లేదా కాలపరిమితికి అనుగుణంగా నియంత్రించబడుతుంది. 
55
FASTag వార్షిక పాస్ పరిమితులు:
  • నిర్దేశించబడిన జాతీయ రహదారి (NH), జాతీయ ఎక్స్‌ప్రెస్‌వే (NE) టోల్ ప్లాజాలలో మాత్రమే.
  • పరిధి ప్లాజాలు: రాష్ట్ర రహదారులు, నగర టోల్‌లు, స్థానిక సంస్థలు నిర్వహించే టోల్ ప్లాజాలు, పార్కింగ్ సౌకర్యాలు మొదలైన వాటిలో సాధారణ FASTag రుసుము వర్తిస్తుంది.
  • వాహనం పరిమితి: FASTag పాస్ అతికించబడిన, నమోదు చేయబడిన వాహనానికి మాత్రమే చెల్లుతుంది. ఇతర వాహనంలో దీనిని ఉపయోగించరాదు. 
  • ఈ నియమాల కారణంగా పాస్ ఉపయోగం కచ్చితంగా నియంత్రించబడుతుంది. వినియోగదారుని స్వంత వాహనానికి మాత్రమే పరిమితం అవుతుంది.
Read more Photos on
click me!

Recommended Stories