Exports: మనం ఇతర దేశాల నుంచి ఎలక్ట్రానిక్ మొదలు కొన్ని రకాల వస్తువులను దిగుమతి చేసుకుంటామని తెలిసిందే. అయితే కేవలం దిగుమతి మాత్రమే కాకుండా భారత్ ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తుందని మీకు తెలుసా.? ఇంతకీ ఆ వస్తువులు ఏంటంటే.?
భారతదేశపు సారవంతమైన భూమి ఎన్నో రకాల పంటలకు నిలయం. బియ్యం, గోధుమలతో పాటు పండ్లు, కూరగాయలు కూడా ప్రధాన ఎగుమతులు. ప్రత్యేకంగా బాస్మతి బియ్యం మధ్యప్రాచ్యం, యూరప్, అమెరికా దేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
25
మఖానా – సూపర్ ఫుడ్‌గా మారిన చిరుతిండి
ఒకప్పుడు సాధారణ స్నాక్‌గా ఉన్న మఖానా, ఇప్పుడు అంతర్జాతీయంగా సూపర్‌ఫుడ్‌గా గుర్తింపు పొందింది. ముఖ్యంగా బీహార్‌లో ఉత్పత్తి అయ్యే మఖానా అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు ఎగుమతి అవుతోంది.
35
సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ
పసుపు, మిరియాలు, ఏలకులు వంటి సుగంధ ద్రవ్యాలు భారతదేశం నుంచి ప్రపంచానికి వెళ్తున్న ప్రధాన ఉత్పత్తులు. అస్సాం టీ, కూర్గ్ కాఫీ కూడా అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి.
బ్రహ్మోస్ క్షిపణి వంటి ఆధునిక రక్షణ ఉత్పత్తులు భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. భారతీయ రైల్వేలు 16కిపైగా దేశాలకు కోచ్‌లు, లోకోమోటివ్‌లు సరఫరా చేస్తాయి. ఇస్రో విదేశీ వినియోగదారుల కోసం ఉపగ్రహాలను ప్రయోగిస్తోంది.
55
వస్త్రాలు, ఆభరణాలు, ఔషధాలు
భారతీయ పట్టు, పత్తి, చేతితో నేసిన వస్త్రాలకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటోంది. వజ్రాలు, బంగారు ఆభరణాలు ప్రధానంగా అమెరికా, యూరప్, యుఎఇ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అదనంగా, భారతదేశం ఔషధాలు, టీకాలు, ఎరువులు, రసాయనాలను కూడా విస్తృతంగా సరఫరా చేస్తోంది.