ESanjeevani: ఆన్‌లైన్‌లో డాక్ట‌ర్ క‌న్స‌ల్టెన్సీ.. రూపాయి కూడా చెల్లించాల్సిన ప‌నిలేదు. ఈ ప‌థ‌కం గురించి మీకు తెలుసా.?

Published : Jul 27, 2025, 11:00 AM IST

ఏదైనా ఆరోగ్య స‌మ‌స్య వ‌చ్చి, వైద్యుడిని సంప్ర‌దించాలంటే ఆసుప‌త్రికి వెళ్లాలి. లైన్‌లో కూర్చొని డాక్ట‌ర్ క‌న్స‌ల్టెన్సీ వ‌చ్చే వ‌ర‌కు ఎదురు చూడాలి. అయితే అలాంటి అవ‌సరం లేకుండా ఆన్‌లైన్‌లోనే వైద్య సేవలు పొందే అవ‌కాశం ఉంద‌ని మీకు తెలుసా.? 

PREV
15
ఈ-సంజీవ‌ని ఓపీడీ ప‌థ‌కం

ఆసుప‌త్రికి వెళ్ల‌కుండానే నేరుగా ఆన్‌లైన్‌లో క‌న్స‌ల్టెన్సీ పొందే అవ‌కాశాన్ని ప‌లు ప్రైవేట్ ఆసుప‌త్రిని కూడా క‌ల్పిస్తున్నాయి. క‌రోనా త‌ర్వాత ఇలాంటి సేవ‌ల‌కు ఆద‌ర‌ణ పెరిగింది. అయితే కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఇలాంటి సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర ప్ర‌భుత్వ వైద్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్ర‌త్యేకించి నేష‌న‌ల్ టెలీక‌న్స‌ల్టేష‌న్ స‌ర్వీసు (National TeleConsultation Service) esanjeevaniOPDని నిర్వ‌హిస్తోంది. ఈ ప‌థ‌కానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

25
అస‌లేంటీ ఈ సంజీవ‌ని.?

ఆన్‌లైన్‌లో ఓపీ సేవ‌లు పొంద‌డం ఈ ప‌థ‌కం ముఖ్య ఉద్దేశం. ఇంట్లో ఉండే వైద్యుల‌కు మీ స‌మ‌స్య‌లు వివ‌రించి ఆరోగ్య స‌ల‌హాలు పొందొచ్చు. ప్ర‌జ‌ల‌కు టెలీ మెడిసిన్ వ‌ర్చువ‌ల్ క‌న్స‌ల్టేష‌న్ సేవ‌ల‌ను అందించాల‌నే ల‌క్ష్యంతో కేంద్రం ఈ ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ ప‌థ‌కం గురించి ఇప్ప‌టికీ చాలా మందికి అవ‌గాహ‌న లేదు.

10 కోట్ల మంది
ఇప్పటి వరకు దేశంలో 10 కోట్ల మందికిపైగా ఈ సేవలు ఉపయోగించుకున్నారు. కాగా వీరిలో అధికంగా ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా 3.17 కోట్ల మంది వినియోగించుకున్నారు.
35
ఎలాంటి వాటికి స‌ల‌హాలిస్తారు.?

నేషనల్ టెలీకన్సల్టేషన్ సర్వీస్ కింద ఇప్ప‌టివ‌ర‌కు 40 ర‌కాల అవుట్ పేషెంట్ విభాగాల‌ను ఈ ఆన్‌లైన్ వేదిక‌పైన అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, ఆర్థోపిడిక్స్ - ఎముక‌ల సంబంధిత జ‌బ్బులు, గైన‌కాల‌జీ, సైకియాట్రి, చ‌ర్మ‌సంబంధిత వ్యాధులు (డెర్మ‌టాల‌జీ) AIDS/HIV రోగుల‌కు యాంటీరెట్రోవైరల్ థెరపీ కార్డియాల‌జీ, చెవి గొంతు ముక్కు సంబంధిత స‌మ‌స్య‌లు, కంటి స‌మ‌స్య‌లు, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ, పీడియాట్రిక్స్‌, అన‌స్థీషియా, రుమ‌టాల‌జీ, ప‌ల్మ‌నాల‌జీ, డెంట‌ల్ ఓపీడీ త‌దిత‌ర విభాగ సంబంధిత సేవ‌లు అందుబాటులో ఉన్నాయి.

45
ఈ సేవ‌లు ఎలా పొందాలి.?

ఇందుకోసం ఈ సంజీవ‌ని అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబ‌ర్‌తో రిజిస్ట్ర‌ర్ చేసుకోవాలి. పూర్తి వివ‌రాలు అందించి ఓపీ టోకెన్ కోసం రిక్వెస్టు పంపాలి. మీ వ్యాధికి సంబంధించి ఏదైనా పాత మెడికిల్ రికార్డులు ఉంటే అందులో అప్‌లోడ్ చేయాలి.

త‌రువాత మీ మొబైల్ నెంబ‌ర‌కు నోటిఫికేష‌న్ వ‌స్తుంది. ఇందులో పేషెంట్‌కు ఒక ఐడీ నెంబ‌రు, టోకెన్ నెంబ‌రు వ‌స్తాయి. వీటి సాయంతో లాగిన్ అవ్వాలి. అనంత‌రం వైద్యుల స‌ల‌హాలు తీసుకోవ‌చ్చు. వ్యాధి ప్ర‌కారం ఈ సేవ‌లు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పొందొచ్చు.

55
వైద్యులు ఎలా సంప్ర‌దిస్తారు.?

టోకెన్ తీసుకున్న త‌ర్వాత మీకోసం ప్ర‌త్యేకంగా ఒక వైద్యుడిని కేటాయిస్తారు. ఆ వైద్యుడి ఆన్‌లైన్ ఓపీలో మీ వెయిటింగ్ లిస్టు నెంబ‌రు మీకు వ‌స్తుంది. ఆ త‌ర్వాత వెయిటింగ్ రూమ్ విండోలో “CALL NOW” బ‌ట‌న్ యాక్టివేట్ అవుతుంది. అనంత‌రం 120 సెక‌న్ల లోపు ఈ “CALL NOW” బ‌ట‌న్‌ను నొక్కాలి. ఇలా నొక్కిన వెంట‌నే వైద్యుడు నేరుగా మీతో వీడియో కాల్‌లోకి వ‌చ్చి మాట్లాడతారు. మీ ఆరోగ్యాన్ని ప‌రిశీలించి మందులు రాస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Read more Photos on
click me!

Recommended Stories