
Dirtiest Trains in India : మనం ఎక్కడికయినా వెళుతుంటే ముందుగానే వాహనాన్ని శుభ్రం చేసుకుంటాం. ప్రయాణం సౌకర్యవంతంగా సాగాలంటే వాహనం పరిశుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం… అందుకోసమే బైక్, కారు వంటి సొంతవాహనాలను శుభ్రం చేసుకుంటారు. కానీ ప్రభుత్వ రవాణా వ్యవస్థల్లో అలా కాదు... ప్రయాణికులు దీన్ని సొంతదిగా భావించరు... అందుకే ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తుంటారు. ఆర్టిసి బస్సుల్లో 'ఈ బస్సు మనందరిది.. దీన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం' అనే రాతలు కనిపిస్తుంటాయి.. దీన్నిబట్టే ప్రజారవాణా వాహనాల్లో ప్రయాణికుల బిహెవియర్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఆర్టిసి బస్సుల్లో ఎంత చెత్తవేసినా, ఎంతలా పాడుచేసిన పది పదిహేను నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు... కాబట్టి వాటిని పరిశుభ్రంగా మెయింటేన్ చేయవచ్చు. కానీ రైళ్లు ఇలాకాదు... పదుల సంఖ్యలో బోగీలు ఉంటాయి... ఒకేసారి వందలు, వేలాదిమంది ప్రయాణిస్తుంటారు. కాబట్టి వారు బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడంతో కొన్ని రైళ్లు డంప్ యార్డ్ ను తలపిస్తుంటాయి. ఇక రైల్వే స్టేషన్స్, ట్రాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు... ఎక్కడలేని చెత్తంతా అక్కడే ఉంటుంది.
ఇలా కొన్ని రైళ్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది... ప్రయాణికులు చెత్తమధ్యలో ముక్కుమూసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. రైల్వే నిర్వహణ లోపమో లేక ప్రయాణికులు బాధ్యత లేకుండా వ్యవహరించడం కారణమో తెలియదుగానీ దేశంలోనే అత్యంత చెత్త రైళ్లుగా కొన్ని నిలిచాయి. అలాంటి రైళ్లలో ప్రయాణం నరకమే. ఒక్కసారి ప్రయాణించారంటే మరోసారి ఇందులో ప్రయాణమంటేనే జంకుతారు. ప్రయాణికులు అనుభవాలు, ఫిర్యాదుల ఆధారంగా దేశంలోనే అత్యంత మురికి రైళ్లు కొన్ని పరిగణింపబడుతున్నాయి… వాటిగురించి తెలుసుకుందాం.
ఇది బిహార్ లోని సహర్సా జంక్షన్ నుండి పంజాబ్ లోని అమృత్‌సర్ జంక్షన్ మధ్య ప్రయాణిస్తుంటుంది. బల్లియా, వారణాసి, లక్నో, మొగల్ సరాయ్, కాన్పూర్, డిల్లీ, అంబాలా వంటి ప్రధాన నగరాలను కూడా కవర్ చేస్తుంది. అయితే ఈ రైలు దేశంలోనే అత్యంత అపరిశుభ్రమైన రైలుగా పరిగణించబడుతుంది.
ప్రయాణికులు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం... నాన్ స్టాప్ గా ప్రయాణం సాగిస్తుండటంతో శుభ్రం చేయడానికి సమయం లేకపోవడంతో ఈ రైల్లో చెత్త పేరుకుపోతుంది. ఈ అపరిశుభ్ర వాతావరణంలోని ప్రజలు ప్రయాణించాల్సి వస్తుంది. ఇక ఈ రైలులోని టాయిలెట్స్ గురించి మాట్లాడకపోవడమే మంచిదని ఇందులో ప్రయాణించినవారు అంటుంటారు.
రాజస్థాన్ లోని అజ్మీర్ పట్టణంనుండి జమ్ము కాశ్మీర్ లోని తావి వరకు రైల్వే శాఖ నడిపే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ఇది. ఈ అజ్మీర్ - జమ్ము తావీ పూజా ఎక్స్ ప్రెస్ మూడునాలుగు రాష్ట్రాలమీదుగా 1000 కి.మీ పైగా సుదీర్ఘ ప్రయాణం సాగిస్తుంది. అజ్మీర్ లో ప్రారంభమై జైపూర్, న్యూడిల్లీ, లూథియానా మీదుగా జమ్మూకు చేరుకుంటుంది. ఈ రైలులో నిత్యం వేలాదిమంది ప్రయాణిస్తుంటారు.
ఈ రైలు కూడా ప్రయాణికులు నిర్లక్ష్యం, రైల్వే శాఖ మెయింటెనెన్స్ లోపం కారణంగానే చెత్త చెదారంతో నిండివుంటుంది. అందువల్లే దేశంలో నడిచే అపరిశుభ్రయమైన రైళ్లలో ఇది ఒకటిగా పరిగణించబడుతోంది.
దేశ రాజధాని న్యూడిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుండి బిహార్ లోని జోగ్బాని రైల్వే స్టేషన్ మధ్య రాకపోకలు సాగిస్తుంది ఈ సీమాంచల్ ఎక్స్ ప్రెస్. ఈ రైలులో ప్రయాణం చాలా దారుణంగా ఉంటుందని రైల్వే శాఖకు అధికంగా ఫిర్యాదులు వస్తుంటాయి. ప్రయాణికుల ప్రవర్తన, అధికారుల నిర్లక్ష్యం వెరసి ఈ రైలును అపరిశుభ్రంగా మారుతోంది. ఇందులో ప్రయాణమంటేనే భయపడిపోయే పరిస్థితి ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నుండి జమ్మూ కాశ్మీర్ లోని ప్రముఖ వైష్ణో దేవి ఆలయానికి రాకపోకలు సాగిస్తుంటుంది ఈ స్వరాజ్ ఎక్స్ ప్రెస్. యాత్రికులతో వివిధ రాష్ట్రాల మీదుగా సుదీర్ఘ ప్రయాణం చేసే ఈ రైలు కూడా చెత్తా చెదారంతో నిండివుంటుంది. రైల్వే శాఖకు ఈ రైలు పరిశుభ్రత గురించి ఎక్కువగా ఫిర్యాదులు అందుతాయి.
పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ నుండి త్రిపురలోని అగర్తల మధ్య నడుస్తుంది ఈ త్రిపురసుందరి ఎక్స్ ప్రెస్. పంజాబ్, హర్యానా, డిల్లీ, ఉత్తర ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల మీదుగా అగర్తల చేరుకుంటుంది. సుదీర్ఘదూరం ప్రయాణించే ఈ రైలు కూడా తీవ్ర అపరిశుభ్రంగా ఉంటుంది. ప్రయాణికుల నుండి నిత్యం ఈ రైల్లోని చెత్త సమస్య గురించి రైల్వే శాఖకు ఫిర్యాదులు అందుతుంటాయి. కానీ దీన్ని శుభ్రపర్చే చర్యలుండవు.