డిజిటల్ ఇండియా పోటీతో పాటు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ శుభ్రతపై కూడా ప్రత్యేక రీల్ పోటీని ప్రారంభించింది. ఈ పోటీలో 90 నుంచి 150 సెకన్ల మధ్య వీడియోను MP4, MOV లేదా AVI ఫార్మాట్‌లో తయారుచేసి https://www.mygov.in/ వెబ్‌సైట్‌లో జూలై 31, 2025లోపు అప్లోడ్ చేయాలి. ప్రతినెలా టాప్ 5 వీడియోలకు రూ. 5,000 బహుమతిగా ఇవ్వనున్నారు.
ఈ పోటీకి సంబంధించి వీడియోలో గ్రామంలో నీటి సరఫరా, శౌచాలయాలు, శుభ్రత అవగాహన, చెత్త నిర్వహణ, మహిళా భాగస్వామ్యం వంటి అంశాలను చూపించాలి. వీడియోలో స్థానిక భాష ఉపయోగించినా, తప్పనిసరిగా హిందీ లేదా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉండాలి.
ఈ రెండు పోటీల ద్వారా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ చైతన్యం, గ్రామీణ శుభ్రత పై ప్రజల్లో అవగాహన పెంచడమే కాకుండా, యువతకు బహుమతులతో పాటు గుర్తింపు ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మీరు ఒక రీల్ క్రియేటర్ అయితే, ఇది మీకు ఒక సువర్ణావకాశం. ఇంకెందుకు ఆలస్యం రీల్ చేయండి మరి !