డెక్కన్ ఓడిస్సీ అనేక మార్గాల్లో నడుస్తుంది. అందులో మూడు ప్రముఖ మార్గాలు ఇవి:
జువెల్స్ ఆఫ్ ది డెక్కన్:
ముంబై నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రయాణం బీజాపూర్, ఐహోళే, పట్టడకల్, హంపి, హైదరాబాద్ వంటి చారిత్రక నగరాలను చూపిస్తుంది. ఆపై ఔరంగాబాద్‌లో అజంతా, ఎల్లోరా గుహలను దర్శించవచ్చు.
మార్గం: ముంబై–బీజాపూర్–ఐహోళే–పట్టడకల్–హంపి–హైదరాబాద్–ఎల్లోరా–అజంతా–ముంబై
వ్యవధి: 7 రాత్రులు / 8 రోజులు
ఛార్జీలు: సుమారు రూ. 3,96,805 నుంచి
ఇండియన్ ఓడిస్సీ:
న్యూఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రయాణం సవాయి మాధోపూర్, ఆగ్రా, జైపూర్, ఉదయపూర్, వడోదరా, ఔరంగాబాద్ మార్గంగా ముంబై చేరుతుంది. ఈ ప్రయాణంలో రణథంబోర్ నేషనల్ పార్క్, తాజ్ మహల్, చాంపానేర్-పావగఢ్ పురావస్తు పార్క్, ఎల్లోరా గుహలు వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.
మార్గం: న్యూఢిల్లీ–సవాయి మాధోపూర్–ఆగ్రా–జైపూర్–ఉదయపూర్–వడోదరా–ఎల్లోరా–ముంబై
వ్యవధి: 7 రాత్రులు / 8 రోజులు
ఛార్జీలు: సుమారు రూ. 3,96,805 నుంచి మొదలవుతాయి.