సెల్ ఫోన్, సోషల్ మీడియా మాయలోపడి ఓ యువతి విచక్షణ కోల్పోయింది… కన్నతల్లి ప్రైవేట్ వీడియోలను ప్రియుడికి పంపించింది. సభ్యసమాజమే తలదించుకునే ఈ సంఘటన బెంగళూరులో వెలుగుచూసింది.
అసలు నేటి యువతరం ఎటుపోతోంది...? చాలామంది యూత్ పేరెంట్స్ చేయిదాటిపోయి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. ఇలాంటి ఘటన ఒకటి ఐటీ సిటీ బెంగళూరులో వెలుగుచూసింది. సభ్యసమాజమే తలదించుకునేలా ఓ అమ్మాయి ప్రవర్తించింది. కుటుంబంలోని మహిళల వీడియోలే కాదు చివరకు కన్నతల్లి వీడియోలను ప్రియుడికి పంపించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
25
ఎంతపని చేశావు తల్లీ..!
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. నగర శివారు ప్రాంతమైన బ్యాటరాయనపురకు చెందిన ఈ కుటుంబంలో 23 ఏళ్ళ యువతి సభ్యురాలు. తల్లిదండ్రులతో పాటు చిన్నాన్న కుటుంబం కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల ఈ యువతి చదువుకునేందుకు ఉపయోగిస్తానని చెప్పి తల్లి ఫోన్ తీసుకుంది. కూతురిపై నమ్మకంతో ఆ తల్లి కూడా రోజుల తరబడి ఫోన్ వాడుతున్నా అనుమానించలేదు. అదే ఆమె చేసిన పెద్ద తప్పయ్యింది.
తల్లి ఫోన్ ను ఉపయోగించిన ఓ యువకుడితో సోషల్ మీడియా ఛాటింగ్ ప్రారంభించింది అమ్మాయి. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ఫోన్ కాల్స్ వరకు వెళ్లింది. అయితే ఓరోజు యువతి సదరు యువకుడితో ఫోన్ లో మాట్లాడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. దీంతో కూతురిని మందలించిన తల్లి అనుమానంతో ఫోన్ చెక్ చేసింది. ఈ క్రమంలో కూతురు తీసిన వీడియోలు చూసి షాక్ అయ్యింది... వెంటనే భర్తకు విషయం తెలిపింది.
35
ఇంతకూ ఏమిటా వీడియోలు..?
సోషల్ మీడియా ప్రియుడి మాయలో పడిపోయిన యువతి విచక్షణ కోల్పోయింది. అతడు ఏం చెబితే అది చేయడం ప్రారంభించింది. ఇలా ప్రియుడి కోరిక మేరకు ఇంట్లోని మహిళలు వీడియోలు తీసి పంపించింది... చివరకు తల్లి వీడియోలు కూడా పంపింది. కుటుంబంలోని మహిళలు పడుకున్న సమయంలో రహస్యంగా వీడియో తీసేది... వాటిని ప్రియుడికి పంపించేది.
ఇలా సొంత తల్లి, పిన్ని ప్రైవేట్ వీడియోలు ప్రియుడికి పంపింది... అతడు ఎక్కడెక్కడ సర్క్యులేట్ చేశాడోనని ఆ కుటుంబం కంగారుపడుతోంది. ఇలా కుటుంబ పరువు తీసిన కూతురు, ఆమె ప్రియుడిపై సదరు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రియుడికి ప్రైవేట్ వీడియోలు పంపించడమే కాదు మందలించిన తల్లిదండ్రులను దూరం చేసుకునేందుకు కూడా సిద్దమయ్యింది సదరు యువతి. నెల రెండునెలల క్రితం పరిచమైన ప్రియుడినే పెళ్లిచేసుకుంటానంది... ఇందుకోసం కనిపెంచిన తల్లిదండ్రులను వదిలేందుకు ప్రయత్నించింది. కానీ ఆమెకు నచ్చజెప్పిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువతికి బ్యాటరాయనపుర పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
సదరు యువతి తీసిన వీడియోలను డిలీట్ చేయించారు కుటుంబసభ్యులు. ఆమెను ప్రేమపేరుతో వలవేసి కుటుంబసభ్యుల వీడియోలు సేకరించిన యువకుడిపై పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
55
నేటి యువతరం ఎటుపోతోంది..?
పిల్లలకు స్వేచ్చ ఇస్తున్నామని అనుకుంటూ అతి స్వేచ్చ ఇస్తున్నారు తల్లిదండ్రులు. స్కూల్ చదివే పిల్లలకు సెల్ ఫోన్లు ఇస్తున్నారు... ఇది వారిని చెడుమార్గాల్లో నడిపిస్తోంది. నేటి యువత చెడిపోడానికి సెల్ ఫోన్ ప్రధాన కారణమని అందరికీ తెలుసు. తాజా ఘటనలో ఇదే జరిగింది... విచ్చలవిడితనంతో విచక్షణ కోల్పోయిన యువతి ఏకంగా తల్లి ప్రైవేట్ వీడియోలను ప్రియుడికి పంపించింది. ఇలాంటి ఘటనలు చూస్తున్నా పేరెంట్స్ మారడంలేదు... పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇవ్వడం మానేంతవరకు ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి.