భార్య‌కు నిద్ర‌మాత్ర‌లిచ్చి భ‌ర్త పాడు ప‌ని.. టీచ‌ర్ అయ్యుండి ఇదేం ప‌ని బాసూ

Published : Apr 10, 2026, 09:49 AM IST

Crime News: కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు చేసిన ప‌ని అంద‌రినీ షాక్‌కి గురి చేస్తోంది. భార్యకు నిద్ర మాత్రలు ఇచ్చి, ఎదురింటి మహిళతో అక్రమ సంబంధం కొనసాగించాడని ఆరోపణలు రావడంతో విషయం పోలీసుల దాకా వెళ్లింది.

PREV
13
ఉపాధ్యాయుడిపై అక్రమ సంబంధం ఆరోపణలు

విజయపురకు చెందిన మాలింగప్ప అనే వ్యక్తి హుబ్బళ్లిలోని ఎల్‌టి తాండా ప్రాంతంలోని ఒక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. 2016లో కాంచన అనే మహిళతో అతనికి వివాహం జరిగింది. ఈ దంపతులకు ప్రస్తుతం మూడు సంవత్సరాల చిన్నారి ఉంది. అయితే పెళ్లైన తర్వాత కొంతకాలం గడిచాక మాలింగప్ప ఎదురింట్లో నివసించే ఒక మహిళతో దగ్గరయ్యాడని ఆరోపణలు ఉన్నాయి. ఆ మహిళ భర్త ఉద్యోగం కోసం బెంగళూరులో ఉండటం వల్ల ఆమె ఎక్కువగా ఒంటరిగా ఉండేదని చెబుతున్నారు. ఈ పరిచయం తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం మొదలైందని బాధితురాలు ఆరోపిస్తోంది.

23
భార్యకు నిద్ర మాత్రలు ఇచ్చి అక్రమ సంబంధం?

భార్యకు తెలియకుండా అక్రమ సంబంధం కొనసాగించేందుకు మాలింగప్ప తీవ్ర చర్యలకు దిగాడని కాంచన చెబుతోంది. రాత్రి సమయంలో భార్యకు బలవంతంగా నిద్ర మాత్రలు ఇచ్చి ఆమెను నిద్రపోయేలా చేసి, తరువాత ఎదురింటి మహిళను ఇంటికి పిలిపించుకునేవాడని ఆమె ఆరోపించింది. ఇది మాత్రమే కాకుండా భార్యకు అనుమానం వస్తే ఆమెపై దాడి చేసి వేధించేవాడని కూడా చెబుతోంది. కొట్టడం, బెదిరించడం వంటి వేధింపులు తరచూ జరిగేవని కాంచన పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మొబైల్‌లో చాటింగ్ చూసి భార్యకు షాక్

ఒక రోజు మాలింగప్ప మొబైల్ ఫోన్ చూసిన కాంచనకు అసలు విషయం తెలిసిందని తెలుస్తోంది. అందులో ఎదురింటి మహిళతో చేసిన చాటింగ్, సందేశాలు, ఫోన్ కాల్స్ చూసి ఆమె షాక్‌కు గురైంది. ఈ విషయాన్ని ప్రశ్నించగానే మాలింగప్ప కోపంతో ఆమెపై దాడి చేశాడని సమాచారం. ఈ సంఘటనల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన కాంచన ఒకసారి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

33
పోలీసులకు ఫిర్యాదు… న్యాయం కావాలని బాధితురాలి విజ్ఞప్తి

తనకు జరిగిన అన్యాయంపై కాంచన మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కౌన్సిలింగ్ పేరుతో చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది. “నాకు న్యాయం చేయాలి” అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధితురాలు మీడియా ముందు మాట్లాడింది. మహిళా సంఘాలు కూడా ఆమెకు మద్ధతుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories