పోలీసుల ఈ ఆలోచనపై కొంతసేపు ఆలోచించిన జిల్లా కలెక్టర్, ''కొయంబత్తూరు జిల్లాలో, మద్యం సేవించేవారి వల్ల ప్రమాదాల సంఖ్య పెరగకూడదు; ప్రాణనష్టం కూడా జరగకూడదు. దానికి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు'' అని చెప్పినట్లు సమాచారం. ఈ ప్రణాళికను అమలు చేయడంపై త్వరలో ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు.
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, నగర పోలీసుల పరిధిలోని అన్ని టాస్మాక్ దుకాణాల ముందు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని పోలీస్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానించాలని పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.