Holidays: 2027 ప్రభుత్వ సెలవుల లిస్ట్ వచ్చేసింది.. ఈసారి ఏకంగా 4 లాంగ్ వీకెండ్స్ పండగే

Published : Nov 27, 2026, 01:36 PM IST

Holidays: 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ విడుదల అయింది. ఈసారి ఏకంగా 4 లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. ట్రిప్ వేసే వారికి మాస్ జాతరనే చెప్పాలి. మొత్తం సెలవుల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
2027లో సెలవులే సెలవులు.. ఉద్యోగులకు 4 లాంగ్ వీకెండ్స్ బంపర్ ఛాన్స్

2027 సంవత్సరానికి సంబంధించిన అధికారిక సెలవుల క్యాలెండర్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విడుదల చేసింది. జులై 2026 మెమోరాండం ఆధారంగా ఈ లిస్ట్‌ను ఖరారు చేశారు. ఇందులో తప్పనిసరి సెలవులు, ఐచ్ఛిక సెలవులు, పరిమిత సెలవుల వివరాలను స్పష్టంగా చెప్పారు. ఢిల్లీ, న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 17 తప్పనిసరి సెలవులు ఉంటాయి. వీటితో పాటు ఉద్యోగులు 32 పరిమిత సెలవుల జాబితా నుంచి రెండు సెలవులను ఎంచుకోవచ్చు.

ఢిల్లీ వెలుపల దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న కేంద్ర కార్యాలయాలకు 14 తప్పనిసరి సెలవులు వర్తిస్తాయి. వీటికి అదనంగా ఆయా రాష్ట్ర రాజధానుల్లోని ‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమన్వయ కమిటీలు’ 12 ఐచ్ఛిక సెలవుల జాబితా నుంచి మూడు సెలవులను ఎంపిక చేస్తాయి. ఒకసారి నోటిఫై చేశాక ఈ జాబితాలో మార్పులు ఉండవు. అలాగే పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు మూడు జాతీయ సెలవులతో కలిపి గరిష్ఠంగా 16 సెలవులు ఉంటాయి. బ్యాంకులకు మాత్రం ఆర్థిక శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు వర్తిస్తాయి.

24
2027 ముఖ్యమైన సాధారణ సెలవుల లిస్ట్ ఇదే

2027లో వచ్చే ప్రధాన సాధారణ సెలవుల తేదీలు, రోజులు ఇలా ఉన్నాయి..

• జనవరి 26: గణతంత్ర దినోత్సవం (మంగళవారం)

• మార్చి 10: ఈద్-ఉల్-ఫితర్ (బుధవారం)

• మార్చి 23: హోలీ (మంగళవారం)

• మార్చి 26: గుడ్ ఫ్రైడే (శుక్రవారం)

• ఏప్రిల్ 15: శ్రీరామనవమి (గురువారం)

• ఏప్రిల్ 19: మహావీర్ జయంతి (సోమవారం)

• మే 17: ఈద్-ఉల్-జుహా / బక్రీద్ (సోమవారం)

• మే 20: బుద్ధ పూర్ణిమ (గురువారం)

• జూన్ 16: మొహర్రం (బుధవారం)

• ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం, మిలాద్-ఉన్-నబీ (ఆదివారం)

• ఆగస్టు 25: శ్రీకృష్ణాష్టమి (బుధవారం)

• అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి (శనివారం)

• అక్టోబర్ 9: విజయదశమి / దసరా (శనివారం)

• అక్టోబర్ 29: దీపావళి (శుక్రవారం)

• నవంబర్ 14: గురునానక్ జయంతి (ఆదివారం)

• డిసెంబర్ 25: క్రిస్మస్ (శనివారం)

34
ఐచ్ఛిక, పరిమిత సెలవుల లిస్టు ఇదే

దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతీయ కార్యాలయాల కోసం ఇచ్చిన 12 ఐచ్ఛిక సెలవుల్లో మకర సంక్రాంతి లేదా పొంగల్, మహా శివరాత్రి, ఉగాది లేదా గుడి పడ్వా లేదా బిహు లేదా వైశాఖి, ఛత్ పూజ, కర్వా చౌత్, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి, హోలీ, వినాయక చవితి, రథయాత్ర, ఓనం, దసరా అదనపు రోజు, వసంత పంచమి వంటివి ఉన్నాయి. వీటిలో 3 ఎంచుకోవాలి.

ఇక పరిమిత సెలవుల జాబితాలో జనవరి 1న న్యూ ఇయర్, జనవరి 14న మకర సంక్రాంతి, జనవరి 15న పొంగల్, మార్చి 22న హోలికా దహన్, ఏప్రిల్ 7న ఉగాది, ఆగస్టు 17న రక్షా బంధన్, సెప్టెంబర్ 4న వినాయక చతుర్థి, అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో దసరా, డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ సహా 30కి పైగా పండుగలు ఉన్నాయి. ఒకవేళ పండుగ సెలవు ఆదివారం లేదా సాధారణ వారాంతపు సెలవు రోజు వస్తే, ప్రత్యామ్నాయ సెలవు ఇవ్వరు.

ఒకే రోజు రెండు పండుగలు వచ్చినా ఇదే రూల్ వర్తిస్తుంది. అయితే నెలవంక ఆధారంగా వచ్చే ఈద్-ఉల్-ఫితర్, బక్రీద్, మొహర్రం, మిలాద్-ఉన్-నబీ తేదీల్లో అవసరమైతే మార్పులు చేసే అధికారం ఉంటుంది. దీపావళి అక్టోబర్ 29న (శుక్రవారం) వచ్చినా, కొన్ని రాష్ట్రాల్లో నరక చతుర్దశి నాడే తప్పనిసరి దీపావళి సెలవు ప్రకటిస్తే అక్కడి కేంద్ర కార్యాలయాలు ఆ రోజే సెలవు పాటించవచ్చు.

44
లాంగ్ వీకెండ్స్ ప్లాన్: ట్రిప్పులకు సూపర్ ఛాన్స్

ట్రిప్పులు, ఫ్యామిలీ ప్లాన్స్ వేసుకునే ఉద్యోగులకు 2027 క్యాలెండర్ మంచి అవకాశాలు ఇస్తోంది. గుడ్ ఫ్రైడే (మార్చి 26 - శుక్రవారం), మహావీర్ జయంతి (ఏప్రిల్ 19 - సోమవారం), బక్రీద్ (మే 17 - సోమవారం), దీపావళి (అక్టోబర్ 29 - శుక్రవారం) నేరుగా వారాంతాలతో కలిసి రావడంతో సహజంగానే 4 లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. ఇంకాస్త ప్లాన్ చేసి ఒక్క రోజు లీవ్ పెడితే ఇంకా ఎక్కువ రోజులు దొరుకుతాయి.

జనవరి 25 (సోమవారం) సెలవు తీసుకుంటే, గణతంత్ర దినోత్సవంతో కలిపి జనవరి 23 నుంచి 26 వరకు 4 రోజులు వస్తాయి. మార్చి 22 (సోమవారం) హోలికా దహన్ సెలవు తీసుకుంటే మార్చి 20 నుంచి 23 వరకు 4 రోజులు లభిస్తాయి. ఏప్రిల్ 16 (శుక్రవారం) సెలవు పెడితే, శ్రీరామనవమి, మహావీర్ జయంతి మధ్య ఏప్రిల్ 15 నుంచి 19 వరకు ఏకంగా 5 రోజులు కలిసి వస్తాయి. అలాగే మే 21 (శుక్రవారం) సెలవు తీసుకుంటే, బుద్ధ పూర్ణిమతో కలిపి మే 20 నుంచి 23 వరకు మరో 4 రోజుల లాంగ్ బ్రేక్ దొరుకుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories