Viral Video: న‌డి రోడ్డుపై సైకిల్ తొక్కుతోన్న ‘దెయ్యం’... గ్రాఫిక్స్ వీడియో అస్సలు కాదండోయ్

Published : Apr 24, 2026, 12:29 PM IST

Viral Video: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరానికి చెందిన యువ ఆవిష్కర్త శివమ్ మౌర్య తన ప్రతిభతో యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాడు. ‘ఘోస్ట్ సైకిల్’ అనే ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌ను రూపొందించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

PREV
14
అసలేంటీ ‘ఘోస్ట్ సైకిల్’.?

ఈ సైకిల్‌లో ముందు చక్రంలో మోటార్ అమర్చారు. సైకిల్ ముందుకు కదలడం ప్రారంభమైనప్పుడు వెనుక చక్రాలు కూడా తిరుగుతాయి. దాంతో చైన్ కదిలి పెడల్స్ తిరుగుతాయి. ఆ పెడల్స్‌కు అనుసంధానంగా ఉన్న మానికిన్ కాళ్లు కూడా కదులుతాయి. సాధారణంగా సైకిల్‌లో మనం పెడల్స్ తిప్పితే చక్రాలు తిరుగుతాయి. కానీ ఈ సైకిల్‌లో మాత్రం చక్రాలు తిరగడం వల్ల పెడల్స్ కదులుతాయి. దీంతో ఆ కాళ్లే సైకిల్ తొక్కుతున్న భావ‌న మ‌న‌కు క‌లుగుతుంది.

24
రోడ్డుపై పరీక్షలు – ప్రజలు ఆశ్చర్యం

సూరత్ నగరంలో ఈ సైకిల్‌ను పరీక్షించగా, దాన్ని చూసిన వారు ఆశ్చర్యపోయారు. త‌ల‌, చేతులు లేకుండా కేవ‌లం కాళ్లు మాత్ర‌మే క‌దులుతూ.. సైకిల్ స్వయంగా కదలడం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. కేవలం కాళ్లు మాత్రమే కనిపించడం వల్ల ఇది ‘ఘోస్ట్ సైకిల్’గా పేరు పొందింది.

34
ఖర్చు, తయారీ సమయం

ఈ ప్రాజెక్ట్‌ను శివమ్ మౌర్య తన స్నేహితుడు గుర్‌ప్రీత్ అరోరాతో కలిసి తయారు చేశాడు. మొత్తం రూ.35,000 ఖర్చు అయింది. ఈ సైకిల్ తయారీకి దాదాపు మూడు నెలలు పట్టింది. కష్టపడి చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

44
రిమోట్, యాప్‌తో కంట్రోల్

ఈ ‘ఘోస్ట్ సైకిల్’ను రిమోట్ లేదా మొబైల్ యాప్ ద్వారా నియంత్రించవచ్చు. అలాగే కోడింగ్ ద్వారా ముందే నిర్ణయించిన మార్గంలో కూడా నడిపేలా చేయవచ్చు. శివమ్ మౌర్యకు ఇలాంటి మరెన్నో ఆవిష్కరణలు ఉన్నాయి. ఆయన యూట్యూబ్ ఛానల్ Creative Science ద్వారా తన ప్రాజెక్టులను పంచుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ డెలివరీ సేవలు, స్మార్ట్ సిటీల్లో భద్రతా పర్యవేక్షణకు ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయం.

Read more Photos on
click me!

Recommended Stories