BSNL Diwali Offer : ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్). ఇప్పటికే కొత్తకొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న బిఎస్ఎన్ఎల్ ఈ దీపావళికి మరో ఆఫర్ ను లాంచ్ చేసింది... ఇలా దేశ ప్రజలకు దీపావళి పండక్కి ముందే గిప్ట్ ఇస్తోంది.
25
ఏమిటీ బిఎస్ఎన్ఎల్ రూ.1 ఆఫర్?
ఈ నెలరోజులపాటు అంటే అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు దీపావళి బొనాంజ ఆఫర్ ను ప్రకటించింది బిఎస్ఎన్ఎల్. ఈ నెలరోజుల్లో కొత్తగా బిఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కు మారాలనుకునేవారికి కేవలం రూ.1 సిమ్ లభిస్తుంది. అంతేకాదు రోజుకు 2GB డాటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఉచితం పొందుతారు. ఇలా నెలరోజులపాటు ఫ్రీగానే బిఎస్ఎన్ఎల్ సేవలను పొందవచ్చు.
దీపావళి ఆఫర్ పొందాలనుకునే వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్ లేదా రిటైలర్ ను సంప్రదించవచ్చు. అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించి రూపాయికే అంటే ఉచితంగా బిఎస్ఎన్ఎల్ సిమ్ పొందవచ్చు... పండగపూట అపరిమిత సేవలను పొందవచ్చు. ఇలా ఈసారి దీపావళి పండగను బిఎస్ఎన్ఎల్ తో కలిసి జరుపుకోవాలని కోరుతోంది ఈ ప్రభుత్వరంగ టెలికాం సంస్థ.
35
బిఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ ప్లాన్
సరిగ్గా 2000 సంవత్సరం, అక్టోబర్ 1న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రారంభమయ్యింది. అంటే ఈ ఏడాదితో బిఎస్ఎన్ఎల్ ప్రయాణం 25 ఏళ్లకు చేరుకుందన్నమాట. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా తమ కస్టమర్లకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది BSNL.
రూ.225 తో సరికొత్త బిఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ ప్లాన్ ను ప్రకటించింది. ఈ రీచార్జ్ తో 30 రోజులపాటు అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 2.5 GB ఇంటర్నెట్ డాటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పొందవచ్చు. ఇంత తక్కువ ధరలో ఏ ప్రైవేట్ టెలికాం సంస్థ కూడా ఇన్నిసేవలను అందించడంలేదు. తమ కస్టమర్లకు సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగస్వామ్యం చేస్తూ సంతోషాన్ని పంచుతోంది బిఎస్ఎన్ఎల్.
ఏ టెలికాం సంస్థలో లేని రూ.99 రీచార్జ్ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ లో ఉంది... ఇలా తమ కస్టమర్లకు అత్యంత తక్కువ ధరతో అత్యుత్తమ సేవలు అందిస్తోంది. 99 రూపాయలతో 15 రోజుల వ్యాలిడిటీలో అన్ లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. అయితే ఇది ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించేవారికి ఉపయోగపడదు. కేవలం కాల్స్ ఎక్కువగా మాట్లాడేవారు నెలలో రెండుసార్లు రీచార్జ్ చేసుకున్నా198 రూపాయలే ఖర్చు అవుతుంది.
55
రూ.229 బిఎస్ఎన్ఎల్ ప్లాన్
బిఎస్ఎన్ఎల్ లో 229 రూపాయలతో మరో అద్భుతమైన ప్లాన్ ఉంది. నెల రోజులపాటు అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు రోజుకు 2GB డేటా లభిస్తుంది. అయితే ఆరోజు డాటా పరిమితి ముగిసినా ఇంటర్నెట్ వస్తుంది... కానీ స్పీడ్ తగ్గుతుంది. ఇక రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి.