Fastag: ఫాస్టాగ్ యూజ‌ర్ల‌కు బంపరాఫర్.. ఫొటో తీయండి రూ. 1000 రివార్డ్ పొందండి

Published : Oct 14, 2025, 03:59 PM IST

Fastag: భారత జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ అనే ఈ ప్రత్యేక కార్య‌క్ర‌మాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
“క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్” అంటే ఏంటి?

NHAI తన “Special Campaign 5.0” భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రహదారుల వద్ద ఉన్న టోల్ ప్లాజాల టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉన్నాయా లేదా తెలుసుకునేందుకు ఇది ఒక పౌర భాగస్వామ్య కార్యక్రమం. చెత్తగా ఉన్న టాయిలెట్‌ను ఎవరు ఫోటో తీసి ఫిర్యాదు చేస్తే, NHAI ఆ ఫిర్యాదును పరిశీలిస్తుంది. సరైనదిగా తేలితే, ఆ వ్యక్తి FASTag ఖాతాలో రూ. 1000 రివార్డుగా జమ చేస్తారు.

25
ఎవరైనా పాల్గొనవచ్చు

ఈ కార్యక్రమం అన్ని రహదారి ప్రయాణికులకూ అందుబాటులో ఉంది. దీని కోసం “రాజ్ మార్గ్ యాత్ర‌” తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ ద్వారా టాయిలెట్ ఫోటోను జియో-ట్యాగ్‌తో అప్‌లోడ్ చేయాలి. ఫోటోతో పాటు పేరు, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఇవ్వాలి.

35
రివార్డు ఎలా వస్తుంది?

ఫిర్యాదు సరైనదని తేలిన వెంటనే, ఆ వ్యక్తి FASTag ఖాతాలో రూ. 1000 రీచార్జ్ రూపంలో రివార్డు వస్తుంది. ఈ బహుమతి మరొకరికి బదిలీ చేయ‌డానికి వీలుండ‌దు. అలాగే న‌గ‌దు రూపంలోకి మార్చుకోలేరు. ప్రతీ టోల్ ప్లాజా రోజుకు ఒకసారి మాత్రమే ఈ రివార్డుకు అర్హత పొందుతారు. 

45
ఏ టాయిలెట్ల‌కు వ‌ర్తిస్తుంది.?

ఈ పథకం NHAI ఆధ్వర్యంలోని టోల్ ప్లాజాల వద్ద ఉన్న టాయిలెట్ల‌కు మాత్రమే వర్తిస్తుంది. హైవేల ప‌క్కన ఉండే పెట్రోల్ బంకులు, దాబాలు లేదా ప్రైవేట్ రెస్టారెంట్‌ల టాయిలెట్లకు ఇది వర్తించదు.

55
జియో-ట్యాగ్ ఫోటో అంటే ఏమిటి?

జియో-ట్యాగ్ చేసిన ఫోటో అంటే, స్థానం, తేదీ, సమయం వివరాలు చూపించే ఫోటో. ఇందులో రేఖాంశం (Longitude), అక్షాంశం (Latitude), ఎత్తు (Altitude) వంటి GPS డేటా ఉంటుంది. దీంతో NHAI ఆ ఫోటో తీసిన స్థలం నిజమా కాదా అని సులభంగా గుర్తించగలదు. ఈ కార్య‌క్ర‌మం అక్టోబర్ 31, 2025 వరకు కొనసాగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories