Bank Holidays : అయ్యబాబోయ్.. ఈ నెలలో బ్యాంకులకు ఇన్ని సెలవులా? ఓసారి ఈ లిస్ట్ చూసుకోండి

Published : Mar 04, 2026, 06:49 PM IST

మార్చి నెల మొదలైంది... పండగల సీజన్ కూడా వచ్చేసింది. దీంతో బ్యాంకు సెలవులపై చాలామంది ఆరా తీస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో భారీగా సెలవులు వస్తున్నాయి.

PREV
16
ఈ నెలలో బ్యాంకులకు సెలవులే సెలవులు

Bank Holidays : ఆర్థిక వ్యవహారాల కోసం ఈ నెల (మార్చ్ 2026) లో మీరు బ్యాంకుకు వెళ్లాల్సి ఉందా..? అయితే ఒక్కసారి ఇక్కడ బ్యాంక్ హాలిడేస్ గురించి తెలుసుకొండి. దీంతో మీరు బ్యాంకులు నడిచేరోజు మాత్రమే వెళ్లి పని ముగించుకోవచ్చు. లేదంటే సెలవు రోజుల్లో వెళితే టైమ్ వేస్ట్ కావడంతో ఇబ్బంది పడతారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడే క్యాలెండర్ ప్రకారం... మార్చి ఆరంభమే సెలవుతో జరిగింది. ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మార్చి 3న హోలీ సందర్భంగా బ్యాంకులు మూతపడ్డాయి. ఇలా మొత్తంగా ఈ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 16 రోజులు సెలవులున్నాయి. ఏరోజు ఎందుకు సెలవులు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

26
ఆదివారం సెలవులు..

ఈ నెలలో ఐదు ఆదివారాలు వస్తున్నాయి... కాబట్టి బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. ఇలా మార్చి 1,8,15,22,29 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు కూడా ఆదివారం మూతపడనున్నాయి.

36
శనివారం సెలవులు...

సాధారణంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు రెండు, నాలుగో శనివారాలు సెలవు ఉంటుంది. ఇలా మార్చి 14 రెండో శనివారం, 28 నాల్గవ శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది. ఈ రోజుల్లో ఎలాంటి బ్యాంక్ కార్యకలాపాలు సాగవు... అయితే డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి.

46
బ్యాంకులకు పండగ సెలవులు..

మార్చి 3 (మంగళవారం) : హోలీ పండగ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సెలవు ఉంది.

మార్చి 4 (బుధవారం) : కొన్నిరాష్ట్రాల్లో హోలీ పండగను మార్చి 4న జరుపుకుంటున్నారు. అందుకే ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు యధావిధిగా నడిచాయి.

మార్చి 6 (శుక్రవారం) : చాప్చర్ కుట్ వేడుకల సందర్భంగా మిజోరాంలోని బ్యాంకులకు సెలవు

మార్చి 17 (మంగళవారం) : షబ్-ఇ-ఖదర్ వేడుకల సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లో సెలవు ఉంది.

మార్చి 19 (గురువారం) : తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకుంటారు... ఇది తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని జరుకునే పండగ. అందుకే మార్చి 19న తెలంగాణ, ఏపీలో బ్యాంకులకు సెలవు ఉంది.

56
మార్చి చివర్లో సెలవులు

మార్చి 20 (శుక్రవారం) : రంజాన్ కు ముందురోజు జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

మార్చి 21 (శనివారం) : ముస్లింల పవిత్ర పండగ రంజాన్ సందర్భంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. చాలారాష్ట్రాల్లో ఈరోజు బ్యాంక్ హాలిడే ఉంటుంది.

మార్చి 26 (గురువారం) : దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. తెలుగు ప్రజలు కూడా ఎంతో భక్తిశ్రద్దలతో ఈ పండగ జరుపుకుంటారు. అందుకే ఏపీ, తెలంగాణలో మార్చి 26 శ్రీరామ నవమి సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది.

మార్చి 31 (మంగళవారం) : ఈ నెల చివరిరోజే మహవీర్ జయంతి ఉంది. ఈ సందర్భంగా కూడా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది.

66
అందుబాటులో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు

సెలవు రోజుల్లో బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు 24 గంటలూ పనిచేస్తాయి. ఏటీఎంలలో యథావిధిగా నగదు అందుబాటులో ఉంటుంది. కానీ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పని ఉంటే, మీ రాష్ట్రంలోని సెలవుల జాబితాను ముందుగానే చూసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories