Bank Holidays : జనవరి 2026 లో ఏకంగా 16 రోజుల బ్యాంక్ హాలిడేస్... ఏరోజు, ఎందుకు సెలవు?

Published : Dec 24, 2025, 07:56 PM IST

January 2026 Bank Holidays : వచ్చే నెల జనవరి 2026 లో బ్యాంకులకు భారీ సెలవులున్నాయి. ఏరోజు, ఎందుకు, ఎక్కడ సెలవు ఉందో ఇక్కడ తెలుసుకొండి… అందుకు తగ్గట్లుగా ప్లాన్ చేసుకొండి. 

PREV
16
జనవరి 2026 లో బ్యాంక్ హాలిడేస్

Bank Holidays : కొద్దిరోజుల్లో ఈ సంవత్సరం 2025కి వీడ్కోలు పలికి కొత్త ఏడాది 2026 లోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే న్యూ ఇయర్ ఆరంభంలోనే వరుస సెలవులు రాబోతున్నాయి. జనవరి 2026 లో మీకు ఏదైనా బ్యాంక్ పని ఉంటే ఈ సమాచారం మీకోసమే... ఏ రాష్ట్రంలో బ్యాంక్ సెలవులు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకొండి,

26
బ్యాంక్ సెలవులకు తగ్గట్లుగా ప్లాన్ చేసుకొండి

జనవరి 2026 లో బ్యాంకులకు మొత్తం 16 రోజుల సెలవులున్నాయి... అయితే ఒక్కో రాష్ట్రంలో సెలవులు ఒక్కోలా ఉన్నాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం… 16 రోజుల్లో పండగలు, ప్రత్యేక పర్వదినాలు, స్థానిక వేడుకలతో పాటు 4 ఆదివారాలు, రెండు-నాలుగో శనివారాల సెలవులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ముందుగానే ప్లాన్ చేసుకోకుండా బ్యాంకుకు వెళ్తే పని కాకుండానే వెనక్కి తిరిగి రావాల్సి రావచ్చు... కాబట్టి బ్యాంకు సెలవు గురించి తెలుసుకుని అందుకు తగ్గట్లుగా ప్లాన్ చేసుకోండి.

36
జనవరి 2026లో బ్యాంకులు ఎప్పుడెప్పుడు మూసి ఉంటాయి?

జనవరి 1- న్యూ ఇయర్ డే, గాన్-నగాయ్ సందర్భంగా కోల్‌కతా, ఐజ్వాల్, చెన్నై, గాంగ్‌టక్, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, షిల్లాంగ్‌లో సెలవు. తెలుగు రాష్ట్రాల్లో ఆప్షనల్ హాలిడే మాత్రమే ఉంది… కాబట్టి బ్యాంకులు పూర్తిగా మూసివేసి ఉండవు. 

జనవరి 2- న్యూ ఇయర్ వేడుకలు, మన్నం జయంతి సందర్భంగా తిరువనంతపురం, ఐజ్వాల్, కొచ్చిలో బ్యాంకులకు సెలవు.

జనవరి 3- హజ్రత్ అలీ జయంతి సందర్భంగా లక్నోలో బ్యాంకులు మూసి ఉంటాయి. తెలంగాణలో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులకు ఐచ్చిక సెలవు ఉంది.

జనవరి 4- ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

జనవరి 10- నెలలో రెండో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.

46
జనవరి మిడిల్ లో బ్యాంకులకు సెలవులు

జనవరి 11- ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు వారపు సెలవు.

జనవరి 12- వివేకానంద జయంతి సందర్భంగా కోల్‌కతాలో బ్యాంకుల్లో పనులు జరగవు.

జనవరి 14- మకర సంక్రాంతి, మాఘ్ బిహు సందర్భంగా అహ్మదాబాద్, భువనేశ్వర్, గువాహటి, ఇటానగర్‌లో బ్యాంకులు బంద్. తెలంగాణ, ఏపీలో కూడా సెలవు ఉంటుంది.

జనవరి 15- మకర సంక్రాంతి, మాఘే సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం, పొంగల్ సందర్భంగా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై, గాంగ్‌టక్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.

జనవరి 16- తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా చెన్నైలో బ్యాంకుల్లో పనులు జరగవు. ఏపీలో సెలవు ఉంటుంది.

జనవరి 17- ఉళవర్ తిరునాళ్ సందర్భంగా చెన్నైలో బ్యాంకుల్లో పనులు జరగవు.

జనవరి 18- ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.

56
జనవరి చివర్లో బ్యాంకులకు సెలవులు

జనవరి 23- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, సరస్వతి పూజ (వసంత పంచమి) సందర్భంగా కోల్‌కతా, అగర్తలా, భువనేశ్వర్‌లో బ్యాంకులు బంద్.

జనవరి 24- నెలలో నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.

జనవరి 25- ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా వారపు సెలవు.

జనవరి 26- గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాన్పూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, శ్రీనగర్ మినహా అన్ని చోట్లా సెలవు.

66
బ్యాంకులు మూసి ఉంటే మీ పనులు ఆగిపోతాయా?

మంచి విషయం ఏంటంటే బ్యాంకు శాఖలు మూసి ఉన్నా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు పూర్తిగా అందుబాటులో ఉంటాయి. యూపీఐ లావాదేవీలు, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలపై సెలవుల ప్రభావం ఉండదు. అయితే చెక్ క్లియరెన్స్, డ్రాఫ్ట్, లాకర్, బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పనులు సెలవుల్లో పూర్తి కావు.

Read more Photos on
click me!

Recommended Stories