Airport: అక్టోబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ నవి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించారు. ఈ విమానాశ్రయం దేశంలోనే తొలి “ఫుల్ డిజిటల్ ఎయిర్‌పోర్ట్”గా గుర్తింపు పొందింది. ఈ ఎయిర్ పోర్ట్ ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్వే ప్రాంతంలోని 1,160 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించిన నవి ముంబై ఎయిర్‌పోర్ట్, దక్షిణ ముంబైకి 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పూర్తిగా నిర్మాణం పూర్తి అయితే దేశంలోనే అతిపెద్ద విమాన హబ్‌గా మారుతుంది. మొత్తం నాలుగు టెర్మినల్స్, రెండు సమాంతర రన్‌వేలు ఉండే ఈ విమానాశ్రయం ప్రతి సంవత్సరం 90 మిలియన్ ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ప్రస్తుతం పూర్తైన తొలి దశలో ఒక టెర్మినల్, 3,700 మీటర్ల రన్‌వేతో కలిపి 20 మిలియన్ ప్రయాణికులను వార్షికంగా సర్వీస్ చేయగలదు.
25
కమల పువ్వు ప్రేరణతో రూపొందిన డిజైన్
జాహా హదీద్ ఆర్కిటెక్ట్స్ రూపొందించిన ఈ ఎయిర్‌పోర్ట్ రూపకల్పన భారత జాతీయ పుష్పమైన కమలం (Lotus) నుంచి ప్రేరణ పొందింది. టెర్మినల్ పైకప్పు స్టీల్, గాజుతో తయారు చేశారు. ఇది గాల్లో తేలుతున్నట్టుగా కనిపించేలా 12 పూలరేకు ఆకారపు స్తంభాలు, 17 భారీ కంబాల సపోర్ట్‌గా ఉన్నాయి. గాలి, భూకంపాలను సైతం తట్టుకునే నిర్మించారు.
35
భారతదేశ తొలి “ఫుల్ డిజిటల్ ఎయిర్ పోర్ట్”
ఈ విమానాశ్రయం పూర్తిగా డిజిటల్‌గా రూపొందించారు. డిజియాత్ర (DigiYatra) సదుపాయం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రయాణికుల నిర్వహణ, పేపర్‌లెస్ ఎక్స్‌పీరియన్స్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ప్రయాణికులు పార్కింగ్ ముందుగా బుక్ చేసుకోవచ్చు, స్వయంగా లగేజ్ డ్రాప్ చేయవచ్చు, మొబైల్ యాప్ ద్వారా టెర్మినల్‌లో ఎక్కడైనా ఆహారం ఆర్డర్ చేయవచ్చు. 36,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో LED స్క్రీన్లు, డిజిటల్ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్లను ఏర్పాటు చేశారు.
మొదటి టెర్మినల్‌లో మొత్తం 88 చెక్-ఇన్ కౌంటర్లు ఉన్నాయి. వీటిలో 66 మానవ సిబ్బందితో నిర్వహిస్తారు, మిగతా 22 సెల్ఫ్ సర్వీస్ కౌంటర్లు ఉంటాయి. “అల్ఫా”, “బ్రావో”, “చార్లీ” అనే మూడు జోన్‌లుగా విభజించారు. లాంజ్‌లు, ట్రావెలేటర్లు, గేమింగ్ జోన్లు, షాపింగ్ ఏరియాలు ఇవన్నీ ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించేందుకు ఏర్పాటు చేశారు.
55
డీ.బీ. పాటిల్ పేరుతో
ఈ విమానాశ్రయానికి “లోక్‌నేతే డీ.బీ. పాటిల్ నవి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్” అని పేరు పెట్టారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల వల్ల ఇబ్బందులు పడ్డ ప్రజల హక్కుల కోసం పోరాడిన సామాజిక నాయకుడు డీ.బీ. పాటిల్ గౌరవార్థం ఈ పేరు పెట్టారు.