ఎయిర్ ఇండియా విమానంలో బ్లాక్ బాక్స్ ల‌భ్యం.. ఇంత‌కీ బ్లాక్ బాక్స్ ఉప‌యోగం ఏంటో తెలుసా.?

Published : Jun 13, 2025, 08:13 PM IST

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ప్రమాద స్థలమైన భవన శిథిలాల మధ్య నుంచి విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్‌ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.  

PREV
18
ప్రమాదానికి గల అసలు కారణాల దర్యాప్తులో వేగం

విమాన ప్రమాదానికి గల నిజమైన కారణాలను గుర్తించేందుకు బ్లాక్ బాక్స్ కీలక ఆధారంగా మారనుంది. విమానం బయలుదేరిన తర్వాత అంతిమ క్షణాల్లో పెరిగిన సాంకేతిక లోపాలు, పైలట్ కమ్యూనికేషన్, కాక్‌పిట్ లో సంభాషణలు అన్నీ బ్లాక్ బాక్స్‌లో రికార్డు అవుతాయి. దీంతో దర్యాప్తు బృందం ఇప్పుడు దీనిని విశ్లేషణకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

28
ప్రాంతీయ సిబ్బంది సహకారంతో దర్యాప్తు కొనసాగుతోంది

ఈ ప్రమాద ఘటనపై కేంద్ర పౌరవిమానయాన శాఖ తీవ్రంగా స్పందించింది. దర్యాప్తు ప్రక్రియలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మందికి పైగా సిబ్బంది కేంద్ర దళాల బృందాలతో కలిసి పని చేస్తున్నారు. శిథిలాల తొలగింపు, ఆధారాల సేకరణ, మృతదేహాల గుర్తింపు వంటి పనులు తక్షణమే చేపట్టినట్లు సమాచారం.

38
265 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన

గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేక్ ఆఫ్ కాసిన కొద్ది సేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 265 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్నినింపింది.

48
అస‌లేంటీ బ్లాక్ బాక్స్‌.?

విమానంలో ఉండే ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) అనే రెండు ముఖ్యమైన పరికరాల సమష్టినే సాధారణంగా "బ్లాక్ బాక్స్" అని అంటారు. ఇది విమానం ఆపరేషన్‌కు సంబంధించిన కీలకమైన డేటాను రికార్డు చేసి భద్రపరుస్తుంది.

58
ఎందుకు "బ్లాక్ బాక్స్" అని పిలుస్తారు?

నిజానికి ఇది నలుపు రంగులో ఉండదు. సాధారణంగా ఆరెంజ్ రంగులో ఉంటుంది, అందుబాటులో ఉండేలా స్పష్టంగా కనిపించేలా చేస్తారు. కానీ మొదటిసారి తయారు చేసినప్పుడు ఇది బ్లాక్ కలర్‌లో ఉండటం వల్ల దీనికి "బ్లాక్ బాక్స్" అనే పేరు స్థిరపడింది.

బ్లాక్ బాక్స్‌లో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. ఫ్లైట్ డేటా రికార్డర్ (Flight Data Recorder – FDR): విమానం వేగం, ఎత్తు, ఇంధన స్థాయి, ఇంజిన్ పనితీరు, గేర్ స్థితి వంటి సాంకేతిక సమాచారం నిల్వ చేస్తుంది. సుమారు 25 గంటల వరకు డేటాను రికార్డు చేస్తుంది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (Cockpit Voice Recorder – CVR): పైలట్‌లు, కో–పైలట్‌ల సంభాషణలు, అలారంలు, ఇతర శబ్దాలు మొదలైన వాటిని రికార్డు చేస్తుంది. చివరి 2 గంటల కాక్‌పిట్ ఆడియోను భద్రపరుస్తుంది.

68
ఇది ఎలా పనిచేస్తుంది?

బ్లాక్ బాక్స్ విమానానికి విద్యుత్ సరఫరా అవుతున్నంత కాలం డేటా రికార్డు చేస్తుంది. డేటా ఒక ప్రత్యేకమైన మేమరీ యూనిట్‌లో భద్రంగా ఉంటుంది. దీనిని అత్యంత బలమైన మెటీరియల్స్‌తో తయారు చేస్తారు. దీని ఆకారం పెద్ద టిఫిన్ బాక్స్‌లా ఉంటుంది. దీని పొడవు సుమారు 10–15 అంగుళాలు, బరువు సుమారు 4.5 కిలోల వరకు ఉంటుంది. దీనిపై "FLIGHT RECORDER – DO NOT OPEN" అని స్పష్టంగా రాసి ఉంటుంది.

78
బ్లాక్ బాక్స్‌ ఉపయోగం ఏమిటి?

విమాన ప్రమాదం జరిగినప్పుడు, అసలు కారణం ఏంటనేది తెలుసుకునేందుకు బ్లాక్ బాక్స్‌ డేటా కీలకంగా ప‌నిచేస్తుంది. పైలట్ తప్పిదమా, సాంకేతిక లోపమా, వాతావరణ ప్రభావమా అనే విషయాలను ఈ డేటా ద్వారా తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

88
దీని ప్ర‌త్యేక‌త ఏంటంటే.?

బ్లాక్ బాక్స్‌ను తయారు చేయడంలో అత్యంత దృఢమైన మెటీరియల్స్ ఉపయోగిస్తారు. 1,100°C వరకు ఉన్నత ఉష్ణోగ్రతను తట్టుకునేలా ఉంటుంది. బలమైన దెబ్బలు, నీటిలో మునగడం, ఒత్తిడిని తట్టుకునేలా డిజైన్ చేస్తారు.

నీటిలో మునిగినప్పుడు, దానిని గుర్తించేందుకు అండర్‌వాటర్ లోకేటింగ్ బీకన్ పనిచేస్తుంది. ఇది ధ్వని తరంగాల రూపంలో సిగ్నల్స్‌ను పంపుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories