Vijay Rupani: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

Published : Jun 12, 2025, 07:39 PM IST

air india plane crashes Ahmedabad: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

PREV
16
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ మృతి

air india plane crashes Ahmedabad: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదం గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్తున్న బోయింగ్ 787 డ్రిమ్‌లైనర్ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే మేఘని నగర్ ప్రాంతంలో కూలిపోయింది. ఇది ఒక నివాస ప్రాంతం కాగా, అక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై నేరుగా విమానం పడినట్లు అధికారులు ధృవీకరించారు.

26
ఒక్కరు మాత్రమే బతికి బయటపడ్డారు

ఈ విమానంలో మొత్తం 242 మంది ఉండగా, వీరిలో 230 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ప్రయాణికుడిగా ఉన్నారు. విమాన సీట్ల కేటాయింపు వివరాల ప్రకారం.. విజయ్ రూపానీ ప్యాసింజర్ నంబర్ 12గా నమోదు అయ్యారు. ఆయన Z క్లాస్‌ (బిజినెస్ క్లాస్)లో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే, ఈ ప్రమాదం నుంచి ఒకరు మాత్రమే బయటపడ్డారని అధికారిక సమాచారం. విశ్వాస్ కుమర్ రమేష్ గా గుర్తించారు. 

36
తన కుమార్తెను కలవడానికి వెళ్తున్న విజయ్ రూపానీ

విజయ్ రూపానీ లండన్‌లో నివసిస్తున్న తన కుమార్తెను కలవడానికి అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరారు. ఆయన భార్య అంజలి రూపానీ ఇప్పటికే అక్కడే ఉండగా, వారిద్దరూ కలిసి తిరిగి భారతదేశానికి రావాలని భావించినట్లుగా సమాచారం. కానీ విమానం టేక్ ఆఫ్ అయిన కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు.

46
ప్రమాద స్థలంలో హాస్టల్ విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు

విమాన ప్రమాదం మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై చోటు చేసుకోవడంతో, మధ్యాహ్నం భోజన సమయంలో అక్కడ ఉన్న విద్యార్థులు, కొంత మంది వైద్యులు కూడా మరణించారు. 50కి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఇది అత్యంత జనసాంద్రత గల ప్రాంతం కావడంతో, ప్రమాద తీవ్రత ఎక్కువగా నమోదైంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

56
ఎవరూ కూడా బతికే అవకాశం లేదా?

అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మలిక్ మాట్లాడుతూ, విమానంలో ఉన్న 242 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. ఎవరూ బతికే అవకాశం లేదని తెలిపారు. బీజేపీ జాతీయ కన్వీనర్ మురళీధర్ రావు స్పందిస్తూ, "విజయ్ రూపానీ మరణం దేశానికి తీరని నష్టం. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలి" అని పేర్కొన్నారు.

66
విజయ్ రూపానీ ఎవరు?

విజయ్ భాయ్ రమణికల్భాయ్ రూపానీ గుజరాత్ 16వ ముఖ్యమంత్రిగా 2016 నుండి 2021 వరకు సేవలందించారు. ఆయన రాజ్‌కోట్ వెస్ట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు పుజిత్ మరణానంతరం ప్రారంభించిన పుజిత్ రూపానీ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు.

Read more Photos on
click me!

Recommended Stories