air india plane crashes Ahmedabad: అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. గాయపడిన వారికి వైద్య సహాయం కల్పిస్తామన్నారు.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ స్పందన
గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందిస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. ప్రమాదంలో గాయపడినవారికి అవసరమైన వైద్య సహాయాన్ని పూర్తిగా అందజేస్తామనీ, బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్‌ను పునర్నిర్మించేందుకు సాయం చేస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
25
టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ప్రకటనలో ఏముంది?
“ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ఈ రోజు విమాన ప్రమాదానికి గురైంది. ఇది ఎంతో బాధను కలిగించింది. మృతుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందిస్తాము. గాయపడిన వారికి అవసరమైన చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. బీజే మెడికల్ హాస్టల్ పునర్నిర్మాణానికి మద్దతు ఇస్తాం. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాల తోడుగా నిలుస్తాం” అని చంద్రశేఖరన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
35
విమానంలోని ఒక్కరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు
AI-171 విమానం మధ్యాహ్నం 1:48కి అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్‌కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే, కేవలం 625 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు అది కుప్పకూలింది. ఈ విమానంలో 242 మంది ఉండగా, అందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాద సమయంలో విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడి పేలినట్టు సమాచారం. ఇది అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి సమీపంలో ఉన్న హార్స్ క్యాంప్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
అధికారిక సమాచారం ప్రకారం, ప్రమాదంలో 204 మంది మరణించినట్లు తొలుత పోలీసులు తెలిపారు. విమానంలోని అందరూ ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. కాలేజీలో కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరణాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం 45 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి బాగానే ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది.
55
సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లు
• పౌర విమానయాన మంత్రిత్వ శాఖ: 011-24610843, 9650391859