Ahmedabad plane crash: అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఎయిర్ ఇండియా AI171 డ్రీమ్లైనర్ ప్రమాదానికి ముందు బోయింగ్ చేసిన 5 పెద్ద తప్పిదాలు ఇప్పుడు విమర్శలకు కేంద్రబిందువుగా మారాయి. ఆవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బోయింగ్ డ్రీమ్లైనర్‌లోని 5 పెద్ద తప్పిదాలు: విమాన ప్రమాదంపై కొత్త ప్రశ్నలు
గురువారం (2025 జూన్ 12న) మధ్యాహ్నం 1.38 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాట్‌విక్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ (AI171) టేకాఫ్ అయిన రెండు నిమిషాల్లోనే కూలిపోయింది.
అంటే సుమారు 1.40 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని కార్గో ఆఫీస్ ప్రాంతంలో కూలిపోయింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, దాదాపు 100 మందిక పైగా ప్రాణాలు కోల్పోయినట్టు అనుమానిస్తున్నారు.
ఈ ప్రమాదం బోయింగ్ సంస్థ గతంలో ఎదుర్కొన్న సాంకేతిక లోపాలను మళ్లీ సమీక్షించేలా చేస్తోంది. బోయింగ్ చేసిన 5 ప్రధాన తప్పిదాలను ఇప్పుడు విమానయాన పరిశ్రమలో నిపుణులు గుర్తుచేసుకుంటున్నారు.
26
1. బోయింగ్ డ్రీమ్లైనర్‌లలో బ్యాటరీ ప్రమాదం.. మూడు నెలల నిషేధం
2013లో జపాన్‌కు చెందిన రెండు విమాన సంస్థలు కొనుగోలు చేసిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానాల్లో లిథియమ్-అయాన్ బ్యాటరీల్లో అగ్ని ప్రమాదాలు సంభవించాయి. విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ 3 నెలల పాటు ఈ మోడల్ విమానాలపై నిషేధం విధించింది.
36
2. బోయింగ్ డ్రీమ్లైనర్‌లలో తయారీ లోపాలు
2020–2022 మధ్య బోయింగ్ డ్రీమ్లైనర్‌లలో మాన్యుఫాక్చరింగ్ లోపాలు నమోదయ్యాయి. విమాన భాగాలను వేర్వేరుగా తయారుచేసి అసెంబుల్ చేయడం వల్ల భాగాల మధ్య గ్యాప్‌లు ఏర్పడుతున్నట్టు నిపుణులు గుర్తించారు.
3. బోయింగ్ డ్రీమ్లైనర్‌లలో అసెంబ్లీ లోపాలపై హెచ్చరికలు
2024లో బోయింగ్‌కు చెందిన సామ్ సాలెహ్ అనే ఉద్యోగి డ్రీమ్లైనర్ 787 విమానంలోని కొన్ని భాగాలు సరిగ్గా కలపలేదని ఆరోపించారు. విమానం మధ్యలో విరిగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. బోయింగ్ ఈ ఆరోపణలను ఖండించింది.
56
4. బోయింగ్ విమానల తయారీపై ప్రశ్నలు లేవనెత్తిన ఉద్యోగి మరణం
2024లో మరొక ఉద్యోగి జాన్ బార్నెట్ బోయింగ్ విమానాల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తారు. కొన్ని నెలల తరువాత ఆయన మృతదేహం ఇంటి వద్ద ఉన్న పార్కింగ్ స్థలంలో కనిపించింది. ఇది అనుమానాస్పద స్థితిలో జరిగింది.
66
5. బోయింగ్ డ్రీమ్లైనర్‌లలో వరుసగా సాంకేతిక లోపాలు
బోయింగ్ 787-8 విమానాల్లో పలుమార్లు ఇంజిన్ సమస్యలు, ఎలక్ట్రికల్ వ్యవస్థ వైఫల్యం, ఫ్యూయల్ లీకేజీలు, సాఫ్ట్‌వేర్ లోపాలు నమోదయ్యాయి. జపాన్‌లో హైడ్రాలిక్ ఆయిల్ లీక్ కారణంగా ఒక విమానాన్ని రన్‌వేపై నిలిపివేయాల్సి వచ్చింది.
ఇప్పుడు అహ్మదాబాద్ ఘటన అనంతరం బోయింగ్ విమాన భద్రతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందరూ ఇప్పుడు ఎయిరిండియా విమాన ప్రమాదంపై తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.