ఇంట్లోనే ఉచితంగా ఆధార్ అడ్రస్ అప్‌డేట్ చేసుకోండి ఇలా

Published : Nov 05, 2025, 08:47 PM IST

Aadhaar Card : ఆధార్ కార్డులో మీ అడ్రస్ ను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్టేడ్ చేసుకోవచ్చు. భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ దీనికోసం కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
ఉచిత ఆధార్ అడ్రస్ అప్డేట్ సౌకర్యం

భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డు దారులకు ఆన్‌లైన్ ద్వారా అడ్రేస్ అప్‌డేట్ చేసే సౌకర్యాన్ని మరింత సులభతరం చేసింది. ఈ సేవలు 2026 జూలై 14 వరకు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటాయి. తాజాగా తీసుకొచ్చిన మార్పులు దేశవ్యాప్తంగా డిజిటల్ సేవల వినియోగాన్ని పెంచుతుందని యూఐడీఏఐ పేర్కొంది.

అయితే పేరు, పుట్టిన తేదీ లేదా బయోమెట్రిక్ వివరాలు (వేలు ముద్రలు, కంటి స్కాన్, ఫోటో) మార్చాలంటే ఆధార్ సేవా కేంద్రంకు వెళ్లడం తప్పనిసరి. ఈ సేవలు ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో లేవు.

25
ఆన్‌లైన్‌లో ఆధార్ అడ్రస్ అప్డేట్ చేయడం ఎలా?

యూఐడీఏఐ ప్రకారం, ఆధార్ చిరునామా మార్చడం చాలా సులభం. ప్రజలు తమ ఇంటి నుంచే ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. స్టెప్ బై స్టెప్ విధానం..

1. UIDAI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2. 'Document Update' ఎంపికను క్లిక్ చేయాలి.

3. ఆధార్ నంబర్ నమోదు చేసి, 'Submit' పై క్లిక్ చేయాలి.

4. రిజిస్టర్‌డ్ మొబైల్ నంబర్‌కి వచ్చిన OTP ద్వారా ధృవీకరణ చేయాలి.

5. 'Address Update' ఎంపిక చేసి, మీరు డాక్యుమెంట్ ద్వారా లేదా కుటుంబ పెద్ద ఆధార్ ద్వారా అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా అనేవి ఎంచుకోవాలి.

6. అవసరమైన వివరాలు నమోదు చేసి, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ను అప్‌లోడ్ చేయాలి.

7. చివరగా Acknowledgement Receipt (URN - 14 అంకెల నంబర్) డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఈ యూఆర్ఎన్ ద్వారా మీ అభ్యర్థన స్థితిని యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో చెక్ చేయవచ్చు. చిరునామా ధృవీకరణ ప్రక్రియ పూర్తవడానికి యూఐడీఏఐకి 30 రోజుల వరకు సమయం పడుతుంది.

35
ఇతర ఆధార్ అప్‌డేట్‌లకు ఫీజులు

యూఐడీఏఐ తాజా ప్రకటన ప్రకారం, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ లేదా బయోమెట్రిక్ వివరాలు మార్చాలంటే 75 నుండి 125 రూపాయల వరకు సేవా రుసుము చెల్లించాలి. ఈ మార్పులు కేవలం ఆధార్ సేవా కేంద్రాల్లోనే చేయవచ్చు.

ఆధార్ సెంటర్‌లో అవసరమైన ఫామ్ ను పూరించి, ఫోటో ఐడీతో పాటు సమర్పించాలి. వివరాలు నమోదు చేసిన తర్వాత బయోమెట్రిక్ ధృవీకరణ జరుగుతుంది.

45
ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్ ఎలా చేసుకోవాలి?

చాలా మంది ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్ సేవలు నిలిపివేసినప్పుడు సమస్యలు ఎదుర్కొంటారు. యూఐడీఏఐ సూచనల ప్రకారం, కొత్త మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో జతచేయడం ఇప్పుడు సులభంగా మారింది.

దీనికోసం సమీప ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలి. అక్కడ ఆధార్ అప్‌డేట్ ఫామ్ తీసుకొని, కొత్త మొబైల్ నంబర్ వివరాలు నమోదు చేయాలి. తర్వాత బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తయిన తర్వాత ₹75 చెల్లించి రసీదు పొందాలి. ఈ రసీదు ద్వారా అప్‌డేట్ స్థితిని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయవచ్చు. ఒకటి రెండు రోజుల్లో కొత్త మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అవుతుంది.

55
ఆధార్ ప్రాముఖ్యత, యూఐడీఏఐ పాత్ర

ఆధార్ కార్డు భారతీయ పౌరుడి గుర్తింపు పత్రంగా మాత్రమే కాకుండా, ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలు, మొబైల్ సిమ్ ధృవీకరణ, పన్ను వ్యవహారాలు వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

యూఐడీఏఐ ఆధార్ వ్యవస్థ ద్వారా పారదర్శకతను పెంచి, పథకాల లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూర్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. 12 అంకెల ఆధార్ సంఖ్య ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైనది. సురక్షితమైన గుర్తింపు పద్ధతిగా నిలిచింది.

యూఐడీఏఐ ప్రకటించిన ఈ ఉచిత ఆన్‌లైన్ చిరునామా అప్‌డేట్ సౌకర్యం ఆధార్ కార్డు వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుంది. 2026 జూలై 14 వరకు అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories