వైద్య నిపుణుల ప్రకారం, అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అనేది మెదడుకు వచ్చే అరుదైన, ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్. దీనిని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు: ప్రాథమిక అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) ,గ్రాన్యులోమాటస్ అమీబిక్ ఎన్సెఫాలిటిస్ (GAE).
ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) ప్రధాన కారణం నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా. ఈ అమీబా మెదడు కణజాలాన్ని నాశనం చేసి, తీవ్ర మెదడు వాపుకు దారితీస్తుంది.
చాలా సందర్భాల్లో ఇది మరణానికి దారితీస్తుంది. ఇన్ఫెక్షన్ అరుదుగా కనిపించినప్పటికీ, సాధారణంగా ఆరోగ్యకరమైన పిల్లలు, కౌమార దశలోని యువకులు ఎక్కువగా బలహీనపడతారు. కలుషితమైన నీటిలో మునిగితే, ఈ ఇన్ఫెక్షన్ రావడంలో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నది, చెరువు, కాలువలలో మునిగే వారు ప్రమాదంలో ఉంటారు.