చవక చవక.. ఈ దేశాలను 40,000 రూపాయల బడ్జెట్లోనే చూసి వచ్చేయచ్చు

Published : Aug 20, 2025, 04:58 PM IST

విదేశాలలో ప్రయాణించాలన్నది ఎంత మంది  కల. విదేశీ ప్రయానాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుందని అనుకుంటారు. ఈ భయంతో చాలా మంది విదేశాలకు వెళ్లందుకు కూడా ప్రయత్నించరు.  కానీ మీ బడ్జెట్‌లోనే అమరిపోయే కొన్ని విదేశాలు ఉన్నాయి. 

PREV
15
బడ్జెట్ ఫ్రెండ్లీ విదేశాలు

విదేశీ ప్రయాణం చాలా ఖరీదైనదని.  దీనికి లక్షల రూపాయల ఖర్చు అయిపోతుందని అనుకుంటారు.  కానీ అది నిజం కాదు. మీరు సరైన ప్రణాళిక వేసుకుని, బడ్జెట్ ఫ్రెండ్లీ గమ్యస్థానాలను ఎంచుకుంటే, 40 వేల రూపాయల లోపే విదేశాలకు వెళ్లి రావచ్చు. నేపాల్ నుండి వియత్నాం వరకు, మీ జేబుకు చిల్లు పెట్టకుండానే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు,  షాపింగ్, ఆహారం, సంస్కృతిని ఆస్వాదించవచ్చు.

25
వియత్నాం

వియత్నాం భారతీయ పర్యాటకులకు చవకైన గమ్యస్థానం. ఇక్కడ అందమైన బీచ్‌లు, నదులు ఎన్నో ఉంటాయి.  ఇక్కడికి వెళ్లేందుకు మార్చి నుండి మే వరకు, సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఉత్తమ సమయం. ఇక్కడి ప్రత్యేకతల గురించి చెప్పాలంటే, మీరు హనోయిలోని ఓల్డ్ క్వార్టర్, హా లాంగ్ బే, దా నాంగ్, వియత్నామీస్ స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదించవచ్చు. వియత్నం వెళ్లేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువే. 

35
భూటాన్

తక్కువ బడ్జెట్లో విహారాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలనుకుంటే భూటాన్ ఉత్తమమైనది. ఈ దేశం  ఎంతో అందంగా ఉంటుంది.  అలాగే ఇక్కడి ఆహారం, ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు, సంస్కృతి, షాపింగ్ ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ కూడా మీరు 40 వేల లోపే తిరిగి రావచ్చు. ఇక్కడికి వెళ్లడానికి వీసా అవసరం లేదు. 

45
కజకిస్తాన్

కజకిస్తాన్‌ ముస్లిం దేశం. దీన్ని కూడా మీరు తక్కువ బడ్జెట్‌లో సందర్శించవచ్చు. ఇక్కడికి వెళ్లడానికి మీకు వీసా అవసరం లేదు. సెప్టెంబర్ నుండి జూన్ వరకు ఇక్కడికి వెళ్లడానికి ఉత్తమ సమయం. ఢిల్లీ నుండి కజకిస్తాన్‌ వెళ్లి రావడానికి మీకు 24 వేలు ఖర్చవుతుంది. ఆ తర్వాత బస, భోజనం, షాపింగ్‌కు 40 వేల వరకు ఖర్చవుతుంది. ఇక్కడి ప్రత్యేక ప్రదేశాల గురించి చెప్పాలంటే, మీరు అల్మాటీలోని ఆధునిక నగర జీవితం, మంచుతో కప్పబడిన పర్వతాలు, షింబులాక్ స్కీ రిసార్ట్, చారిత్రక ప్రదేశాలను చూడవచ్చు.

55
నేపాల్

నేపాల్ భారతదేశానికి దగ్గరగా ఉన్న దేశాలలో ఒకటి నేపాల్ ఒకటి. ఇది బీహార్ సరిహద్దుకు ఆనుకుని ఉంది. తక్కువ బడ్జెట్‌లో నేపాల్ వెళ్లి రావచ్చు. నేపాల్ పర్వతాలను చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మీరు 40 వేల రూపాయల ఖర్చుతోనే  4-5 రోజులు సులభంగా గడపవచ్చు. ఇక్కడికి వెళ్లడానికి అక్టోబర్ నుండి మార్చి వరకు ఉత్తమ సమయం. నేపాల్‌లో చూడదగ్గ ప్రదేశాలు మౌంట్ ఎవరెస్ట్, పోఖారా, కాఠ్‌మాండులోని ఆలయాలు, బౌద్ధ స్థూపాలు.

Read more Photos on
click me!

Recommended Stories