ఈ 5 వినాయక మంత్రాలు జపిస్తే.. విజయం, సంపద, శ్రేయస్సు మీ సొంతం!

Published : Aug 20, 2025, 03:48 PM IST

వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో జ్ఞానం, విజయం, సంపద సొంతం అవుతాయని భక్తుల నమ్మకం. గణేషుడిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని మంత్రాలున్నాయి. వాటిని పఠించడం వల్ల జీవితంలో సుఖ శాంతులు పెరుగుతాయని నమ్మకం. అలాంటి కొన్ని మంత్రాలు మీకోసం. పఠించండి.

PREV
15
వినాయకుడి మంత్రాలు

హిందూ సంప్రదాయంలో మొదటి పూజ అందుకునే దేవుడు గణేషుడు. భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తే అదృష్టం, జ్ఞానం, సంపద సిద్ధిస్తాయని పండితులు చెబుతారు. గణేషుడిని ప్రసన్నం చేసుకోవడానికి.. ఆయన అనుగ్రహం పొందడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. వాటిని పఠించడం వల్ల కోరికలు నెరవేరడంతో పాటు అన్ని పనుల్లో విజయం దక్కుతుందట. మరి ఆ మంత్రాలేంటో చూద్దామా.. 

25
గణేషుడి మంత్రాలు

“ఓం గం గణపతియే నమః”

ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని ప్రతికూలతలు తొలగిపోయి, విజయం దక్కుతుందని పండితులు చెబుతారు. ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఈ మంత్రాన్ని జపిస్తే ఆ పనిలో విజయం దక్కుతుందట. 

"ఏకదంతాయ విద్మహే.. వక్రతుండా ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్"..

ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా జ్ఞానం సిద్ధిస్తుందని, తెలివితేటలు పెరుగుతాయని పండితులు చెబుతారు.

35
గణపతి మంత్రాలు

"వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా"..

పండితుల ప్రకారం.. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. చేపట్టిన పనుల్లో విజయం దక్కుతుంది. జ్ఞానం, సంపద, అదృష్టం కలిసివస్తాయి.

45
విఘ్నేషుడి మంత్రాలు

“ఓం విఘ్ననాశాయ నమః”

ఈ మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయట. ఎలాంటి లోటు లేకుండా జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలని పండితులు చెబుతుంటారు.

“ఓం గజకర్ణకాయ నమః”

పండితుల ప్రకారం.. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది. ఒత్తిడిని అధిగమించడంలోనూ ఈ మంత్రం సహాయపడుతుంది.

55
వినాయకుడి మంత్రాలు

ఓం నమో సిద్ధి వినాయకాయ.. సర్వకార్య కర్త్రే సమస్త విఘ్న ప్రశమ్నయ్, సర్వార్జయ్ వశ్యాకరాణాయ్ సర్వజన్ సర్వస్త్రీ పురుష్ ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహా..

ఈ మంత్రాన్ని జపించడం ద్వారా జీవితంలో శ్రేయస్సు, సంపద కలుగుతాయని నమ్మకం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories