Yoga Day 2022: ఈ యోగాసనాలతో గుండె జబ్బులు మటుమాయం..!

Published : Jun 20, 2022, 03:50 PM IST

Yoga Day 2022: యోగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో వ్యాధులు సోకకుండా మనల్ని కాపాడుతుంది. ముఖ్యంగా క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా..  మనకు గుండె జబ్బులను వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. 

PREV
16
Yoga Day 2022: ఈ యోగాసనాలతో గుండె జబ్బులు మటుమాయం..!

కొంతకాలం నుంచి గుండె సంబంధిత వ్యాధుల సంఖ్య పెరుగుకుంటూ వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నవారిలో గుండె జబ్బులు ప్రధాన కారణాలలో ఒకటిగా వెల్లడించింది. దీనికి కారణాలు.. మారుతున్న జీవన శైలి, పని ఒత్తిడి. అయితే గుండె జబ్బుల (Heart disease)నుంచి మనల్ని రక్షించడానికి యోగా ఎంతో సహాయపడతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

26

కేవలం పదే పది నిమిషాలు యోగాసనాలు వస్తే చాలు. గుండె జబ్బులు (Heart disease) మీ చెంతకే రావు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యోగా సాధన చేయడం వల్ల రక్తపోటు (Blood pressure), కొలెస్ట్రాల్ (Cholesterol), చక్కెర స్థాయిలు (Sugar levels), హృదయ స్పందన రేటు (Heart rate) ను తగ్గించడానికి సహాయపడుతుంది.

36

మూడు ఆసనాలను క్రమం తప్పకుండా వేయడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గుండెను సురక్షితంగా ఉంచగల ఆ మూడు యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

46

కుర్చీ భంగిమ (Chair Pose)

కుర్చీ భంగిమ (Chair Pose)ను ప్రాక్టీస్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. కుర్చీ భంగిమ చీలమండలు (Ankles), తొడలు (Thighs), Shins, వెన్నెముక (Spine)ను బలోపేతం చేస్తుంది. ఈ సమయంలో భుజం, ఛాతీలో ఒత్తిడి కలుగుతుంది. ఈ ఆసనం ఉదర అవయవాలు, డయాఫ్రాగమ్, గుండెను ఉత్తేజపరుస్తుంది. ఇది దానిని జాగ్రత్తగా చూసుకునే సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అంటే కుర్చీ భంగిమలు మీకు అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. 
 

56

సేతుబంధాసనం (Setu Bandhasana): 

ఈ సేతుబంధాసనాన్నే బ్రిడ్జి భంగిమ అనికూడా అంటారు.  దీనిని రెగ్యులర్ గా చేయడం ద్వారా గుండె జబ్బులను నివారించొచ్చు. ఈ ఆసనం లోతుగా శ్వాసించడానికి (Breathe deeply) సహాయపడుతుంది. ఇది ఛాతీ భాగంలో  Dilation, రక్త ప్రసరణను పెంచుతుంది. వెన్నెముక, ఛాతీని వ్యాప్తి చేయడానికి, ఒత్తిడిని తొలగించడానికి ఈ ఆసనం సహాయపడుతుంది.
 

66

ధనుర్వాసనం (Dhanurasana):

ఈ ధనుర్వాసనం రెగ్యులర్ గా వేయడం వల్ల  గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంటామని యోగా నిపుణులు చెబుతున్నారు. ధనుర్వాసనాన్ని క్రమం తప్పకుండా అభ్యసించడం వల్ల గుండె బలపడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ యోగాససనం చేయడం ద్వారా మొత్తం శరీరంలో లోతైన సాగతీత ఉంటుంది. దీని వల్ల శరీరంలోని కండరాలు కూడా బలంగా ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories